తన ఆఫీసులో పనిచేస్తున్న ప్రొడక్షన్ ఎగ్జి క్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో వైసీపీ నేత పీవీపీతోపాటు మరికొందరికీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.ఈ కేసులో నాలుగు వారాల్లోగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
గత ఏడాది సెప్టెంబర్ లో తన భర్తను పీవీపీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లారని ఆరోపిస్తూ తిమ్మారెడ్డి భార్య జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పీవీపీతోపాటు మరికొందరు తనను కిడ్నాప్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారంటూ పోలీసులకు తిమ్మారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటనలో పీవీపీతోపాటు ఆయన భార్య, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తిమ్మారెడ్డి కిడ్పాప్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారంతా హైకోర్టును ఆశ్రయించారు.
వాదనలు విన్న హైకోర్టు తిమ్మారెడ్డిని కిడ్నాప్ చేసినట్టు ఆధారాలు లేకపోవడంతో పీవీపీ, మరికొందరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.