టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఒక్క బాహుబలి తప్ప ఇంకే సీక్వెల్ వర్క్ అవుట్ అయిన దాఖలాలు లేవు . అందులోనూ స్టార్స్ తో సంబంధం లేకుండా డిజాస్టర్స్ ఎక్కువ. అయినా మనవాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ కోవలో వస్తోందే ప్రేమ కథా చిత్రం 2. సుమంత్ అశ్విన్ హీరోగా నందిత శ్వేతా హీరొయిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. టీజర్ విషయానికి వస్తే ఇది కూడా రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ జానర్ లో అదే ఫార్ములాలో సాగిన ఫీలింగ్ కలిగించింది. మొదట్లో సుమంత్ అశ్విన్ ను హత్యలు చేసే వాడిగా పరిచయం చేసిన తీరు కాస్త ఆసక్తి కలిగించినా ఆ తర్వాత మొత్తం రొటీన్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది.
ఒక ఇంట్లో కొందరే ఉండటం దెయ్యం బయటికి కనిపించకుండా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళను ఆడుకోవడం గతంలో ఎన్నో సార్లు చూసేసి అరిగిపోయిన ట్రాక్. ఇందులో కూడా అదే కొనసాగించారు. కాకపోతే రెగ్యులర్ గా చూసే బ్యాచ్ కాకుండా అప్ కమింగ్ స్టేజి లో ఉన్న కృష్ణతేజ అనే యాక్టర్ ను తీసుకోవడం ఒక్కటే మార్పు.ప్రేమ కథా చిత్రంకు సీక్వెల్ అని దీనికి 2 తగిలించారు కాని ఇది దానికి కొనసాగింపు కాదు. ఆ స్థాయి మేకింగ్ కూడా కనిపించడం లేదు.
సింపుల్ గా కాలేజీ అవుట్ డోర్ లో కొంత తీసేసి దాదాపు ఓ ఇంట్లోనే షూటింగ్ మొత్తం కానిచ్చేసిన్దట్టు ఉన్నారు. హరికిషన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జేబీ సంగీత దర్శకుడు. ఏ విభాగం గురించి ప్రత్యేకించి ప్రస్తావించేంత మ్యాటర్ ఇందులో లేదు. అంత ఒకే తరహాలో సాగింది. అయినా అవుట్ డేటెడ్ గా అనిపించే ఇలాంటి థీమ్ తో ఇంకా సినిమాలు రావడం అంటే ఆశ్చర్యమే. టీజర్ ఇలా కట్ చేసి సినిమాలో ఏమైనా సర్ ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాలి.
Full View