సాయి తేజ్ కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 12 న రిలీజ్ కానుంది. ఏప్రిల్ 6 న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వరసగా ఒక్కో లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తూ ఉన్న 'చిత్రలహరి' టీమ్ తాజాగా ఈ సినిమా నుండి 'ప్రేమ వెన్నెల రావే ఊర్మిళ' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి. పాడిన వారు సుదర్శన్.. అశోక్. "రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా ఏడు రంగులు ఒక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణ వాణిలా గుండెలో పొంగిన కృష్ణ వేణిలా.." అంటూ ఎంతో అందమైన పదాలతో సాగింది శ్రీమణి సాహిత్యం. ఇక ఈ పాటకు పర్ఫెక్ట్ మ్యాచ్ లా దేవీ ఒక మంచి మెలోడీ ట్యూన్ ను స్వరపరచడంతో.. వెంటనే మ్యూజిక్ లవర్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఈమధ్య దేవీ మ్యూజిక్ లో పెప్ లేదని.. ట్యూన్స్ రొటీన్ అవుతున్నాయని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ 'చిత్రలహరి' పాటలు మాత్రం ఆ విమర్శలకు సమాధానంలా ఉంది. ప్రేమ వెన్నెల మంచి మెలోడీలా సాగుతూ రిపీట్ మోడ్ లో వినే పాటలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దేవీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఒక లుక్ వేసేయండి.
Full View