ప్రేమమ్ బ్యూటీనే నెంబర్ వన్

Update: 2017-02-03 05:40 GMT
ఇంకా పట్టుమని మూడు సినిమాలు కూడా చేయలేదు. మూడో సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అయినా సరే మలయాళ ప్రేమమ్ లో నటించిన సాయి పల్లవి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేసింది. హీరోయిన్ నెంబర్ గేమ్ లో భాగం కాకపోయినా.. సాయిపల్లవి క్రేజ్ ఎలా ఉందో చెప్పేందుకు కొచ్చి టైమ్స్ నిర్వహించిన పోల్ ఓ సాక్ష్యంగా చెప్పచ్చు.

తాజాగా కొచ్చి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వివెన్ పోల్ నిర్వహించింది. ఇందులో సాయి పల్లవికి టాప్ ర్యాంక్ కట్టబెట్టేశారు కేరళ జనాలు. ప్రేమమ్ మూవీలో లో మలార్ పాత్రలో బ్యూటిఫుల్ టీచర్ గా అమ్మడు అలరించిన తీరు.. కేరళ ఆడియన్స్ ను ఆ రేంజ్ మాయలో పడేసింది. గతేడాది కూడా దుల్కర్ సల్మాన్ తో చేసిన కాళి చిత్రం హిట్ కావడంతో.. ఈ భామ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈ భామ.. తన యాక్టింగ్ తో కుర్రకారును మెస్మరైజ్ చేసేస్తోంది. అందుకే మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా టాప్ ప్లేస్ దక్కించేసుకుంది.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేయడానికి వచ్చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న ఫిదా చిత్రంలో నటిస్తోంది సాయిపల్లవి. ఫిదా తర్వాత టాలీవుడ్ లో సాయి పల్లవి హవా స్టార్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News