కొన్నేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ప్రేమిస్తే గుర్తుందా? ఆ సినిమా తమిళంలో కాదల్ పేరుతో తొలుత రిలీజ్ అయ్యింది. అక్కడ సూపర్ హిట్ కావటంతో దాన్ని ప్రేమిస్తే పేరిట తెలుగులో డబ్ చేశారు. ఆ చిత్రంలో భరత్.. సంధ్యలు జంటగా నటించారు. విషాదాంతమైన ముగింపు ఉన్న ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. పదమూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ చిత్రం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది.
ఈ సినిమాలో నటించిన ఒక నటుడు గుడి దగ్గర బిచ్చం ఎత్తుకొని బతుకుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిన్నపాత్ర పోషించి.. అందరి దృష్టిలో పడ్డ అతడు.. కాలక్రమంలో సరైన అవకాశాలు రాకపోవటంతో చివరకు బిచ్చం ఎత్తుకునే వరకూ వెళ్లటంపై అందరూ షాక్ కు గురి అవుతున్నారు.
ప్రేమిస్తే మూవీలో సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వచ్చిన కుర్రాడిలా నటించాడు పల్లుబాబు. సినిమాలో విరుచ్చికాంత్ పేరు పెట్టుకొని.. తాను నటిస్తే హీరోగానే నటిస్తానని.. ఆ తర్వాత పాలిటిక్స్.. ఆపై ముఖ్యమంత్రి కావటమే అంటూ చెప్పిన డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. అతడి పాత్ర.. డైలాగులు పాపులర్ అయినా.. నటుడిగా అతడు మాత్రం పాపులర్ కాలేకపోయారు. తర్వాతి కాలంలో అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఓ పక్క పేదరికం.. మరోపక్క అవకాశాలు రాకపోవటంతో చివరకు చెన్నైలోని చూలైమేడు గుడి దగ్గర భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. రంగుల ప్రపంచంలో అంతా బాగుంటే ఓకే. తేడా వస్తేనే అసలు ఇబ్బంది అంతా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/