ప్రేమిస్తే సంధ్య.. కేరళలో పెళ్ళయ్యింది

Update: 2015-12-07 06:56 GMT
వరదలు చెన్నైని ఎంతగా చిన్నాభిన్నం చేసేశాయో చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈ రోజుల్లోనే పెళ్లిముహూర్తం పెట్టుకుంది సంధ్య. ప్రేమిస్తే చిత్రంలో కాస్త గడుసైన అమ్మాయి గాను, అన్నవరంలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగాను కనిపించింది సంధ్య. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినిమా ఫీల్డ్ లో ఎక్స్ పోజింగ్ లాంటి వాటి జోలికి పోకుండా.. కేవలం తన పెర్ఫామెన్స్ తోనే అవకాశాలను సంధ్య తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ గ్లామర్ రోల్స్ జోలికే పోలేదంటే ఈమె కమిట్ మెంట్ అర్ధం అవుతుంది.

అయితే..  పెళ్లి అనేది ఎన్నో సెంటిమెంట్లకు ముడిపడ్డ అంశం కావడంతో.. లొకేషన్ మార్చి పెళ్లి చేసుకుంది ఈమె. ఐటీ ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్ సంధ్యకు పెళ్లి కుదిరింది. నిజానికి వీళ్ల పెళ్లి చెన్నైలోనే జరగాల్సి ఉన్నా.. ఈ ఇద్దరి ఫ్లాట్స్ వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో తమ మ్యారేజ్ ని కేరళలోని గురువాయూర్ కు మార్చుకున్నారు. ఎలాగోలా గురువాయూర్ చేరుకున్న రెండు కుటుంబాలు దైవ సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఇంత ప్రకృతి బీభత్సం జరిగిన సమయంలో పెళ్లికి బదులుగా.. వాయిదా వేసుకుంటే అందరి అభిమానం పెరిగేదని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాకపోతే ఎలాగూ పెళ్లి అయిపోయింది కాబట్టి.. కంగ్రాట్స్ చెప్పేద్దాం ఈ జంటకి.
Tags:    

Similar News