కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జన జీవనం స్థంభించి పోయింది. రెండు వందలకు పైగా దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక దేశం నుండి మరో దేశానికి రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఈ సమయంలో కొందరు విదేశాల్లో చిక్కుకు పోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ వారు ఆ దేశంలో ఒంటరిగా ఎలా ఉన్నారో అంటూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సామాన్యు నుండి సెలబ్రెటీల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ప్రస్తుతం జోర్డాన్ లో చిక్కుకు పోయారు. గత కొన్ని వారాలుగా ఆయన అక్కడే ఉండి పోయాడు. మలయాళ చిత్రం ‘ఆడు జీవితం’ షూటింగ్ కోసం అంటూ యూనిట్ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లిన పృథ్వీరాజ్ కరోనా కారణంగా షూటింగ్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు తిరిగి వచ్చేందుకు ఇండియాకు విమాన సర్వీసులు లేకపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పృథ్వీరాజ్ భార్య సుప్రియ మీనన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ... మలయాళి తొలి పండుగా విషును మిస్ అవుతున్నాను. గత సంవత్సరం మనమిద్దరం కలిసి విషును జరుపుకున్నాం. ఆ సంతోషం ఈ ఏడాది లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత ఏడాది జరుపుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఇద్దరి మద్య వేల మైళ్ల దూరం ఉందని ఆమె ఎమోషనల్ అయ్యింది. త్వరలోనే మనమిద్దరం కలుస్తామని ఎదురు చూస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది.