'లీడర్` సినిమాతో తెలుగువారికి పరిచయమైంది తమిళమ్మాయ్ ప్రియా ఆనంద్. తమిళమ్మాయే అయినా తెలుగు మూలాలు ఉన్న అమ్మాయిని అని చెప్పింది. తెలుగు భాషను స్వచ్ఛంగా మాట్లాడడంతో తెలుగులో పెద్ద స్టార్ అయిపోతుందనే అనుకున్నారంతా. కానీ అచ్చులో బొమ్మ అక్కడే తిరిగబడింది. ఆ తర్వాత `రామ రామ కృష్ణ కృష్ణ` చిత్రంలో రామ్ సరసన నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ క్రమంలోనే తమిళ పరిశ్రమ వైపు వెళ్లిపోవాల్సొచ్చింది. వాస్తవానికి ప్రియా ఆనంద్ `వామనన్` అనే తమిళ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తమిళంలో రెండు సినిమాల్లో నటించాకే, తెలుగువారికి పరిచయమైంది. ఆ సెంటిమెంటుతోనే వరుసగా తమిళ చిత్రాల్లోనే నటించింది. కజిన్ శ్రీదేవి రీఎంట్రీ మూవీ `ఇంగ్లీష్ వింగ్లీష్`లోనూ ఓ కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తమిళంలో 2017-18 సీజన్ వరకూ డజను పైగా చిత్రాల్లో నటించింది. మధ్యలో మలయాళం - కన్నడలోనూ అడపాదడపా సినిమాలు చేసింది. బాలీవుడ్ లో `ఫక్రీ రిటర్న్స్` అనే చిత్రంలోనూ డెబ్యూ నాయికగా ప్రవేశించింది.
ఇప్పటికిప్పుడు మలయాళంలో `కాయమ్ కులమ్ కొచ్చున్ని` అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఎల్ కేజీ అనే చిత్రంలో ఆడిపాడుతోంది. ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈలోగానే కన్నడంలో `ఆరెంజ్` - మలయాళంలో `నీతి` అనే చిత్రాలకు సంతకాలు చేసింది. ఇవి రెండూ ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్నాయి. సౌత్ లో అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంది ప్రియా. అయితే ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ ని మాత్రం అందుకోలేకపోతోంది.
నేను మరీ అంత అందంగా ఉండనా? అంటూ లీడర్ టైమ్ లోనే కాస్తంత సందేహాన్ని వ్యక్తం చేసింది. తనని ఎవరో అంత అందంగా ఉండవు! అని కామెంట్ చేశారని అప్పట్లో అంది. కారణం ఏదైనా ఆ తర్వాత అందాన్ని కాపాడుకునేందుకు ప్రియా చాలానే చేసింది. కానీ అందంగా కనిపిస్తేనే ఇక్కడ అవకాశాలు దక్కవు. ప్రతిభ - ప్రాణం పెట్టి నటించడం మాత్రమే నడిపిస్తాయని ఈ అమ్మడు అనుభవంలో తెలుసుకోవాల్సింది!