టాలీవుడ్ కి ఓ అడ్వాంటేజ్ ఉంది. ఎంతమంది కమెడియన్స్ వచ్చినా.. ఇంకా బోలెడంత మంది వచ్చేందుకు స్కోప్ ఉంటుంది. మెప్పిస్తే ఆడియన్స్ నుంచి ఆదరణ కూడా ఉంటుంది. పెళ్లిచూపులు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన కొత్త కమెడియన్ ప్రియదర్శి. ఇప్పుడీ కుర్రాడికి ఒకేసారి రెండు పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి.
ఎన్టీఆర్ నటించిన జై లవకుశ.. మహేష్ బాబు మూవీ స్పైడర్ లలో కీలకమైన పాత్రలు చేశాడు. జైలవకుశలో నిడివి తక్కువ అయినా ఓబులేష్ పాత్రలో కనిపించి.. కాసేపు నవ్వించాడు. అయితే.. ఇవేమీ గుర్తించుకోదగ్గ స్థాయిలో లేవు. ఇతడి కామెడీ టైమింగ్ లో తేడా లేదు కానీ.. డైలాగ్ రైటర్స్ ఫాల్ట్ కారణంగా.. ఆ కేరక్టర్ అంతగా పండలేదు. ఇక స్పైడర్ మూవీలో అయితే.. దాదాపుగా సినిమా అంతా మహేష్ బాబుతో ఉండే రోల్ లో కనిపించాడు ప్రియదర్శి. ఇలాంటి అవకాశం.. కొత్త కమెడియన్స్ కి చాలా అరుదుగా వస్తుంది. కానీ ఇక్కడ కూడా ప్రియదర్శి తన ప్రత్యేకత చాటలేకపోయాడు. జస్ట్ మహేష్ ఏం చెబితే అది చేసే అసిస్టెంట్ పాత్ర తప్ప.. ఆ రోల్ కి అంటూ స్పెషల్ ఐడెంటిటీ మిస్ అయింది.
స్పైడర్ లో హీరో తల్లిని కాపాడే సీన్.. ప్రియదర్శి ప్లాన్ అనుకునే లోపే.. ఆ కాస్త క్రెడిట్ కూడా మహేష్ చేతిలో పెట్టేస్తాడు డైరెక్టర్. అంతా మహేషే చేసుకుంటే ఇక ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇతరులు ఏం చేస్తారో.. వాళ్లకు బ్రెయిన్స్ ఉంటాయో లేవో లాంటి లాజికల్ క్వశ్చన్స్ ను.. టాలీవుడ్ ఆడియన్స్ అడక్కూడదు. ఆ సంగతి సరే కానీ.. ఫ్యూచర్ లో స్టార్ కమెడియన్ గా ఎదుగుతాడని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ప్రియదర్శికి.. తక్కువ సమయంలో వచ్చిన రెండు భారీ చిత్రాలు నిరుత్సాహమే మిగిల్చాయి.