ప్రియమణి ఘాడమైన చూపు..అర్థం అదేనా.?

Update: 2018-07-30 11:53 GMT
హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతోంది ప్రియమణి.. తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ - హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణికి బాగా పేరు తీసుకువచ్చాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ప్రియమణి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన తరువాత ప్రియమణి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం సంపాదన కోసం బుల్లితెర షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది.

తాజాగా ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.  ‘ఆసక్తికరమైన - సంతోషకరమైన శుభవార్తని త్వరలోనే వెల్లడిస్తానని’  రాసుకొచ్చింది.  భార్య-భర్తలిద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఘాడమైన ప్రేమ భావనను ఫొటోలో వ్యక్తపరుస్తున్నారు. ఈ ఫొటోలు చూశాక.. బహుశా ప్రియమణి తల్లి కాబోతోందని.. అందుకే ఈ ఫొటోలను షేర్ చేసి సస్పెన్స్ లో పెట్టిందని కామెంట్లు వినపడుతున్నాయి.
Tags:    

Similar News