బీచ్ లో గ్లోబల్ స్టార్ సమ్మర్ వెకేష‌న్‌

Update: 2018-05-11 09:10 GMT
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏం చేసినా వార్తే. మొన్నటి మెట్ గాలాలో మెరూన్ వెల్వెట్ రంగు గౌనుతో మెరుపులు మెరిపించింది. ఆ కార్య‌క్ర‌మం ఇలా ముగిసిందో లేదో వెకేష‌న్ కోసం బీచ్‌కు చేరింది. అక్క‌డ తీసుకున్న ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేస్తూ కేక పుట్టిస్తోంది పీసీ. హాలీవుడ్‌ కు చేరుకున్నాక మ‌రింత ఫ్యాష‌న్ ఫ్రీక్ గా మారిపోయింది.

ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్ కోసం హాలీవుడ్‌ కు చేరింది. ఇప్ప‌టికే రెండు సిరీస్‌ లు పూర్త‌య్యాయి. ఇప్పుడు మూడో సిరీస్ ప్ర‌సారం అవుతోంది. మొద‌టి రెండు సిరీస్‌ లు 22 ఎపిసోడ్‌లు కాగా మూడో సిరీస్ మాత్రం 13 సిరీస్‌లే. మూడో సిరీస్ షూటింగ్ పూర్తి చేశాక మెట్ గాలా ఈవెంట్‌కు సిద్ధ‌మైంది. అంత‌కుమందే ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి చేసింది. ప్ర‌స్తుతం అన్ని షూటింగ్‌లు పూర్త‌వ్వ‌డంతో రిలాక్స్ అయ్యేందుకు స్నేహితురాలితో క‌లిసి బీచ్‌కు చేరుకుంది. ట్రెండీ చెవిరింగుల‌తో ఆరెంజ్ క‌ల‌ర్ బికినీతో ఫంకీ స‌న్ గ్లాసెస్‌తో చాలా హాట్‌ గా ఫోజిచ్చింది ఫోటోకి. మ‌రొక ఫోటోలో బికినీపై  ప‌సుపు ష‌ర్టు వేసి న‌డుం ద‌గ్గ‌ర ముడి పెట్టింది. జ‌త‌గా తెల్ల‌ని వ‌దులైన ప్యాంటుతో స్నేహితురాలిపై చేయి వేసి నిలిచింది. ఈ రెండూ ఫోటోలు పీసీ అభిమానుల‌కు తెగ న‌చ్చేశాయ్‌. ఆమె ఏం చేసినా అభిమానులు న‌చ్చేయ‌డం కామ‌న్ అయిపోయింది.

త్వ‌ర‌లో మ‌ళ్లీ బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వ‌బోతోంది ప్రియాంక‌. హాలీవుడ్ ప్రాజెక్టులు ఒప్పుకున్నాక ఇక్క‌డ ఒక్క ప్రాజెక్టు ఒప్పుకోలేదు. స‌ల్మాన్ ఖాన్ తో అలీ అబ్బాస్ జాఫ‌ర్స్ బారాత్ సినిమాతో న‌టించ‌బోతోంది. మ‌ళ్లీ చాలా నెల‌ల త‌రువాత హిందీ సినిమాలో న‌టించ‌డం చాలా అనందంగా ఉంద‌ని చెబుతోంది. ఈ సినిమా 2019లో విడుద‌ల కానుంది.
Tags:    

Similar News