దీపికనుండి ఆ కిరీటం తీసేసుకున్న పీసీ

Update: 2018-08-22 06:29 GMT
'సిగరెట్ తగని వాడు దున్నపోతై పుట్టున్' అని ఓ పాపులర్ తెలుగు డైలాగ్ ఉంది కదా.   ఇప్పుడు అది మనం స్మార్ట్ ఫోన్ కు - సోషల్ మీడియాకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా జనాలు క్షమిస్తారేమో  గానీ సోషల్ మీడియా ఎకౌంటులు లేకపొతే మనం ఈ సభ్యసమాజానికి దూరంగా ఉన్న అడవిమనిషి అని నిర్ధారించే ప్రమాదం ఉంది.. అంటే 'సోషల్ మీడియా ఎకౌంటు లేనివాడు హైబ్రిడ్ బుల్ - అయి పుట్టున్' అన్నట్టుగా!

ఈ ఉపోద్ఘాతానికి కారణం ఏంటంటే గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా సాధించిన ఘనత. పీసీకి అసలే ఫాలోయింగ్ ఎక్కువ.. హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది.  తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ సంగతే తీసుకుంటే ఎప్పుడో పాతిక మిలియన్ ఫాలోయర్ల మార్క్ ను క్రాస్ చేసింది.. అంటే రెండున్నర కోట్లమంది నెటిజనులు ఆమెకు ఫాలోయర్స్.  కానీ మరో గ్లోబల్ సుందరి దీపిక పదుకొనే కు కూడా అలాంటి ఫాలోయింగే ఉంది.  ప్రియాంక - దీపికల మధ్య పోటాపోటీగా ఉండే ఈ ఫాలోయర్ల సంఖ్య కొన్ని నెలల క్రితం దీపిక కు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రియాంక దీపిక ను భారీ తేడాతో దాటేసింది.  దీపిక కు 25.8 మిలియన్ల ఫాలోయర్లే ఉండగా ప్రియాంకకు ఇప్పుడు 26.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. దీంతో అత్యధిక సంఖ్యలో ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్న ఇండియన్ సెలబ్రిటీ గా దీపిక నుండి కీరీటం తీసేసుకుంది.

ఉన్నట్టుండి ఇంత ఫాలోయింగ్ ఎలా పెరిగింది అంటే.. దానికి కారణం నిక్ జోనాస్ తో ప్రేమాయణం.. ఆ తర్వాత జరిగిన నిశ్చితార్థమే. తరచుగా వార్తల్లో నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయర్ల సంఖ్య కూడా పెరిగింది. 
Tags:    

Similar News