ఫోటో స్టోరీ: తొలి దీపావళి అదిరిందిగా

Update: 2019-10-27 16:10 GMT
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా ఆమెరికా కోడలుగా మారినా తన మూలాలు మర్చిపోకుండా అన్ని పండుగలు జరుపుకుంటోంది.  కొద్దిరోజుల క్రితం నార్త్ ఇండియన్స్ ఎంతో భక్తితో జరుపుకునే కర్వా చౌత్ పండుగను జరుపుకుంది.. ఆరోజు భర్త నిక్ జోనాస్ కోసం ఉపవాసం కూడా ఉందట. ఇప్పుడేమో దీపావళి కూడా జరుపుకుంటోంది.

ప్రియాంక ప్రస్తుతం తన భర్తగారి ఫ్యామిలీతో కలిసి కాబో సాన్ లుకాస్ రిసార్ట్ లో సరదాగా గడుపుతోంది.  అక్కడి నుంచి కొన్ని ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ప్రియాంక అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.  ఈ సందర్భంగా షేర్ చేసిన ఒక ఫోటోలో తన భర్త నిక్ ను ప్రేమగా చూస్తూ ఉంది. నిక్ కూడా అంతకంటే డబల్ ప్రేమతో తన సతీమణి కళ్ళలోకి చూస్తున్నాడు.  ఈ ఫోటోలో నిక్ వైట్ షర్టు.. క్యాజువల్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.. ప్రియాంక మాత్రం ఫ్లవర్ డిజైన్ ఉన్న శారీ.. బంగారు రంగులో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఇండియన్ టచ్ ఇచ్చింది.   మరో ఫోటోలో ప్రియాంక కుటుంబం బస చేస్తున్న విల్లా లైట్ల వెలుగులతో ధగధగలాడుతోంది.

ప్రియాంక పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోలకు దాదాపు 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఫోటోలను లైక్ చేయడంతో పాటుగా ప్రియాంక - నిక్ జంటకు మొదటి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:    

Similar News