న్యూయార్క్ వీధుల్లో ప్రియాంక అదరగొట్టింది

Update: 2018-07-17 10:35 GMT
ప్రియాంక చోప్రా ఇండియన్ యాక్ట్రెస్ అనే సంగతి జనాలు మరిచిపోయారు. ఆమె ఇక్కడ సినిమాలు చేసి కొన్నేళ్లవుతోంది. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ కోసం కొన్నేళ్లుగా అమెరికాలోనే ఉంటోందామె. మధ్యలో రెండు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ప్రియాంక ఇక అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే సెటిలైపోతుందేమో అని కూడా అంటున్నారు. తాజాగా ఆమె ఇంకో హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ‘ఈజెంట్ ఇట్ రొమాంటిక్’ అనేది ఆ సినిమా పేరు. ఇందులో రెబెల్ విల్సన్. లియామ్ హెమ్స్ వర్త్.. ఆడమ్ డివైన్.. బెట్టీ గిల్పిన్ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కోసం న్యూయార్క్ వీధుల్లో ఒక పాట చిత్రీకరించడం విశేషం. ఆ పాట చిత్రీకరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో పాటలు.. డ్యాన్సులకు చోటుండదు. కానీ ప్రియాంక ఉండటం వల్లో ఏమో.. ఇందులో ఒక పాట పెట్టినట్లున్నారు. ఆ పాట కోసం మిగతా ఆర్టిస్టులతో కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది ప్రియాంక ఈ వీడియోలో. ఎంతమంది ప్రముఖ నటీనటులున్నా.. ప్రియాంకే ఇందులో హైలైట్ అవుతోంది. హాట్ హాట్ గా ఉన్న పింక్ డ్రెస్సులో మెరిసిపోయిందామె. బాలీవుడ్లో బోలెడన్ని సినిమాల్లో డ్యాన్సులు చేసిన అనుభవంతో ప్రియాంక ఇక్కడా అదరగొట్టేసింది. మిగతా వాళ్లే ఆమె లాగా రిథమ్ అందుకోలేకపోయారు. 35 ఏళ్ల ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో కలిసి కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు.

మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News