ఫోటో స్టొరీ: రొమాంటిక్ మూడ్ లో నిక్ - ప్రియాంక

Update: 2019-07-28 05:23 GMT
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ఇద్దరూ లవ్ లో పడిన క్షణం నుంచి ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నారు. లవ్ ఎఫైర్.. ఎంగేజ్మెంట్.. మ్యారేజ్.. ప్రతి సందర్బం ఒక హాట్ టాపిక్కే. ఇక వివాహం తర్వాత కొన్ని నెలలకు 'OK' అనే మ్యాగజైన్లో విడాకుల కథనం వస్తే అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత అది ఒక ఉత్తుత్తి కథనం అని తేలిపోయింది.  ప్రస్తుతం అయితే నిక్ - ప్రియాంక జంట ప్రేమసాగరంలో ఓలలాడుతున్నారు.

ఈమధ్య మయామీ బీచ్ లో ప్రియాంక.. జోనాస్ కుటుంబ సభ్యులతో కలిసి ఫుల్లుగా చిల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.  బోటులో కూర్చొని స్మోకింగ్ కూడా చేస్తూ అందరినీ ఆకర్షించింది.  తాజాగా ప్రియాంక అదే వెకేషన్ నుంచి మరో రెండు ఫోటోలు షేర్ చేసింది.  ఒక ఫోటోకు "మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బెలూన్ లాంటి ఫ్లోటింగ్ బోటు మీద నిక్కు గారి బాహు బంధాలలో చిక్కుకుని.. ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమబాసలు చేస్తోంది.  ఆయనగారు నిక్కర్ లోనూ.. ఆవిడగారు బికినీలోనూ ఉన్నారు.  నిక్ ఒక చేత్తో ప్రియమైన సతీమణిని లాలిస్తూ.. మరో చేతిలో సిగార్ పట్టుకొని వైఫ్ తో ప్రేమ వైఫైని గట్టిగా కనెక్ట్ చేస్తూ ఉన్నాడు.  మరో ఫోటో కాస్త క్లోజప్ లో ఉంది.  అక్కడ కూడా ఇదే తంతు.

ఈ ఫోటోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది.  ఒక్కో ఫోటోకు రెండున్నర మిలియన్ల లైకులు వచ్చాయి.  కియారా అద్వాని.. షిబాని దండేకర్ లాంటి ఎంతోమంది బాలీవుడ్ హాటు బ్యూటీలు ఈ ఫోటోలకు లైకులు కొట్టారు. కొంతమంది నెటిజన్లు "హౌ రొమాంటిక్.. నైస్ కపుల్".. "ఫ్లోటింగ్ బోట్ సూపర్ గా ఉంది".. "నిక్ కు ముకేష్ యాడ్ చూపించు".. "ప్రేమ మామూలుగా లేదే".."చేతులకు గ్లౌజులు ఎందుకు?"  అంటూ కామెంట్లు పెట్టారు.   ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే 'ది స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో నటిస్తోంది.


Tags:    

Similar News