మెట్ గాలా 2019 ఈవెంట్ కే మతి చెడేలా.. పీసీ ఇచ్చిన ఆ ఫోజు గురించి ప్రపంచమంతా ముచ్చటించుకుంటోంది. న్యూయార్క్ కి చెందిన ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్న తాజా యాన్యువల్ ఈవెంట్ కి పీసీ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈవెంట్ ఆద్యంతం కళ్లన్నీ పీసీపైనే. హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి పింక్ కార్పెట్ పై అమెరికా కోడలు ప్రియాంక చోప్రా హొయలు పోయిన తీరు అందరికీ కన్నుల పండుగ చేసింది.
ఇక ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జోడీ ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ ఆ ఈవెంట్ కే వన్నె తెచ్చాయి. ఎవ్వర్ లేటెస్ట్ .. యూనిక్ స్టైల్ లో ఈ ఆదర్శ జంట కనిపించింది. నిక్ జోనాస్ వైట్ సూట్ ధరించి కాళ్లకు సిల్వర్ ఛమ్కీల షూస్ తో మెరుపులు మెరిపించాడు. ఆ మెడలో టై షూష్ కలర్ కి మ్యాచ్ అయ్యేలా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఆకట్టుకుంది. ప్రియాంక చోప్రా లుక్ డిజైన్ గురించి చెప్పాల్సిన పనేలేదు.
ఫ్యాషన్ ప్రపంచానికే చెమటలు పట్టించేసింది ఈ కొత్త లుక్. పీసీ శిరోజాల నుంచి ఐ లైనర్ నుంచి .. ఆ డిజైనర్ డ్రెస్ వరకూ ఈ లుక్ యూనిక్ అన్న ప్రశంసలు దక్కాయి. సిల్వర్ లైనింగ్ డిజైనర్ డ్రెస్ లో ఎన్నో వింతలు విశేషాలు కట్టి పడేశాయి. చేతికి ధరించిన గాజులు.. ఐ మస్కారా.. బొట్టు బిళ్ల ఇలా ప్రతిదీ సిల్వర్ రంగుతో పెర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరాయి. పీసీనా.. మెజీషియనా? అన్నంతగా లుక్ ఛేంజోవర్ కనిపించింది. పీసీ- నిక్ జోడీ ఈ వేదికపై ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఇచ్చిన ఫోజు హైలైట్ గా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో దీపిక పదుకొనే.. కిమ్ కర్ధాషియన్.. కాన్యే వెస్ట్.. కిండాల .. కైలీ జెన్నర్.. మిలీ సైరస్.. ష్వాన్ మెండిస్.. జెండాయ.. లుపితా న్యోంగో.. రిహానా .. కార్డీ బీ వంటి పాపులర్ సెలబ్రిటీలు పాల్గొని హంస నడకలతో వన్నె తెచ్చారు.