ప్రెస్టీజియస్ అవార్డు పట్టేసిన మన హీరోయిన్

Update: 2016-01-07 14:04 GMT
ఏమో అనుకుంటాం కానీ.. ప్రియాంక చోప్రా రేంజే వేరండీ. మన హీరోయిన్ ‘క్వాంటికో’ లాంటి పాపులర్ అమెరికన్ టీవీ సిరీస్ లో నటించడమే విశేషమంటే.. అందులో పెర్ఫామెన్స్ కు గాను ప్రెస్టీజియస్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. అమెరికాలో ఏటా నిర్వహించే ‘పీపుల్స్ ఛాయిస్’ అవార్డుల్లో భాగంగా ‘ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ న్యూ టీవీ సిరీస్’ విభాగంలో అవార్డు అందుకుంది.

పీపుల్స్ ఛాయిస్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి ప్రియాంక చోప్రానే కావడం విశేషం. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్లు ఎమ్మా రాబర్ట్స్ - లియా మిచెలీ - జేమీ లీ కర్టిస్ - మార్సియా హార్డెన్ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి ప్రియాంక ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. ఇది ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన అవార్డు. ఈ పురస్కారం అందుకుని ఉబ్బితబ్బిబ్బయిపోయింది ప్రియాంక.

‘క్వాంటికో’ సిరీస్ లో ప్రియాంక అలెక్స్ పారిస్ అనే ఎఫ్.బి.ఐ ఏజెంటుగా నటించింది. ఈ సిరీస్ కోసం కార్లో, బాత్రూమ్ లో శృంగారంలో పాల్గొనే ఎరోటిక్ సన్నివేశాల్లో నటించి సంచలనం రేపింది ప్రియాంక. హాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ సన్నివేశాల్లో అల్లుకుపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. మొత్తంగా ‘క్వాంటికో’లో తన పెర్ఫామెన్స్ తో అందరి మతులు పోగొట్టి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది ప్రియాంక.
Tags:    

Similar News