బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు హాలీవుడ్లో కూడా తన ప్రతిభ చాటుకుంటున్న సుందరి ప్రియాంక చోప్రా. కెరీర్లో ఏవిధమైన మార్పులు వచ్చాయో తెలియదు కాని పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలనే మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ మీడియా ప్రియాంక అక్కడి పాపులర్ సింగర్ నిక్ జోన్స్ ప్రేమలో మునిగి తేలుతుంది అని కోడై కూస్తోంది.
ఇటు ప్రియాంకా కూడా అవి నిజం అన్నట్టే అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలా సార్లే కెమెరా కంటపడింది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈమె ఏకంగా అతనిని ఇండియా కి తీసుకొచ్చింది. కచ్చితంగా తన కుటుంబ సభ్యులకు ఇతడిని పరిచయం చేసి నిశ్చితార్థం కానిచ్చుకుందాం అని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రియాంక గోవా ఫోటోలు ఇప్పుడు నెట్టింట్ లో వైరల్ అవుతున్నాయి. ఈమె తన బాయ్ ఫ్రెండ్ - చెల్లి పరిణీతి చోప్రా మరికొందరు స్నేహితులతో బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఆ ఫోటోలే ఇప్పుడు నెటీజన్లను అలరిస్తున్నాయి. స్వయంగా ప్రియాంకా నే ఈ ఫోటోలను తన ట్విట్టర్ లో పెట్టడం విశేషం. మొత్తానికి త్వరలో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరగబోతోంది అనే వార్తలు మాత్రం మరింత బలపడుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే నిక్ ప్రియాంకా కంటే 11 ఏళ్ళు చిన్నవాడు.