ఆమెకు పీఎం పోస్ట్‌..వాళ్ల ఆయ‌న‌కు పెద్ద‌న్న ప‌ద‌వి!

Update: 2019-06-04 04:53 GMT
స‌ర‌దాగా మాట్లాడిందో.. మ‌న‌సులో కొత్త ఆలోచ‌న వ‌చ్చిందో కానీ.. తాజాగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. సాధార‌ణంగా రాజకీయాల గురించి పెద్ద‌గా మాట్లాడ‌ని ప్రియాంక‌.. ఈసారి మాత్రం అందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు తెర తీశాయి. త‌మ‌కు కానీ అవ‌కాశం వ‌స్తే.. తాను భార‌త‌దేశానికి ప్ర‌ధానిని అవుతాన‌ని.. త‌న భ‌ర్త నిక్ జోనాస్ అమెరికా అధ్య‌క్షుడ‌వుతార‌ని వ్యాఖ్యానించారు.

తొలిసారి ఆమె చేసిన ఇంట‌ర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ ఈ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఛాన్స్ ల‌భిస్తే నేను భార‌త ప్ర‌ధానిని అవుతా.. నా భ‌ర్త నిక్ అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తారు. నాకు రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఉన్న అంశాలంటే న‌చ్చ‌వు. కానీ దేశంలో మార్పు రావాల‌ని నేను.. నిక్ కోరుకుంటున్నామ‌న్నారు.

ఆమె వ్యాఖ్య‌లు స‌ర‌దాగా చేసిన‌వా.. లేదంటే తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అమెరికా.. ఇండియా మ‌ధ్య వాణిజ్య అంశాలకు సంబంధించి  కొంత గ్యాప్ ఉండ‌టం.. భార‌త్ కు ఇబ్బంది క‌లిగేలా ట్రంప్ నిర్ణ‌యాలు ఉండ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.
Tags:    

Similar News