బాలీవుడ్ హీరోయిన్ నుంచి గ్లోబల్ హీరోయిన్ అని గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి అమ్మడు ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటూనే ఉంది. హాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది అంటే ఆమె లెవెల్ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ మ్యాగజిన్ లలో గా కనిపించి షాక్ ఇస్తూనే ఉంటుంది. ఇకపోతే చాలా రోజుల తరువాత ప్రియాంక ఇండియాలో అడుగుపెట్టింది.
అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించడం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. హాలీవుడ్ నటుడైన నిక్ జొనాస్ తో కలిసి ఎయిర్ పోర్టు నుంచి కారులో వెళుతుండగా కెమెరాకు చిక్కారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో జనాలు కూడా ప్రియాంక బాయ్ ఫ్రెండ్ అని ఎగబడి చూశారు. అయితే కెమెరాతో ఫొటోలు తీస్తుండగా నిక్ జొనాస్ విండో కర్టెన్ తో మొహం కనిపించకుండా కవర్ చేసినప్పటికీ అతని గెడ్డం కనిపించడంతో అసలు విషయం బయటపడింది.
ఎప్పుడు లేని విధంగా ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ ను ఇండియాకు తీసుకురావడానికి ఓ కారణం ఉందట. నిక్ ఇటీవల ప్రియాంకను తన పెద్దలకు పరిచయం చేసినట్టుగానే ప్రియాంక కూడా తన తల్లి దండ్రులకు నిక్ ను పరిచయం చెయ్యాలని అనుకుంటోందట. ఇటీవల వర్సోవా బీచ్ వద్ద ప్రియాంక 15 పడకల గదులున్న విలాసవంతమైన భవనాన్ని కొనేసింది. మరికొన్ని రోజుల్లో నిర్వహించే గృహ ప్రవేశ వేడుకలో పార్టీ నిర్వహించి అప్పుడే నిచ్చితార్ధం కూడా ప్లాన్ చేసుకున్నారని సమాచారం.