అమెరికన్ బాయ్ ఫ్రెండ్ తో గోవా టూర్

Update: 2018-06-25 09:54 GMT

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈమధ్య హెడ్ లైన్స్ లో బాగానే కనిపిస్తోంది. కొత్తగా సినిమాలు రిలీజయినప్పడు.. అవార్డులు దక్కించుకున్నప్పుడు ఆమె పేరు చాలాసార్లు హెడ్ లైన్స్ లో వచ్చింది. కానీ ఈమధ్య కొత్తగా బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుని అతడితో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ కెమెరా కళ్లకు చిక్కుతోంది.

ప్రియాంక చోప్రా ఈమధ్య బాలీవుడ్ ను వదిలేసి హాలీవుడ్ లోనే ఎక్కువ టైం గడుపుతోంది. అమెరికాలో ఆమెకు పాపులర్ సింగర్ నిక్ జోనాస్ పరిచయమైంది. వీరిద్దరి పరిచయం పలకరింపులు దాటి ప్రేమ కబుర్ల దాకా చేరుకుంది. అమెరికాలోని రెస్టారెంట్లకు కలిసి తిరిగారు. నిక్ జోనాస్ తో ప్రేమాయణం ముదిరి పాకన పడటంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి ప్రియాంక రెడీ అయిపోయిందని బాలీవుడ్ లో టాక్ వినిపించింది. దీనికి మరింత బలం చేకూరుస్తూ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ను వెంటేసుకుని ఇండియాలో ల్యాండయిపోయింది.

తాజాగా ప్రియాంక - నిక్ జోనాస్ కలిసి  ఓ డిన్నర్ కు అటెండయ్యారు. తన ప్రేమికుడిని పరిచయం చేసేందుకు తల్లి మధు చోప్రాను కూడా ఈ డిన్నర్ కు ప్రియాంక ఇన్వయిట్ చేసింది. అంతా కలిసి భోజనం చేశాక చిరునవ్వుతో బయటకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక నిక్ ను వెంటేసుకుని గోవా టూర్ కు వెళ్లింది. ఈ టూర్లు చూస్తుంటే ఇండియాలో తానెంత సంపాదించిందో బాయ్ ఫ్రెండ్ కు చూపించడానికి వెళ్తున్నట్టుంది. రేపో.. మాపో వీళ్లిద్దరూ మనసులో మాట బయటపెడతారని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రియాంకా.. మనసులో ఉన్న ఆ మాటేదో చెప్పేస్తే పోలా..



Tags:    

Similar News