డాడీ డే రోజున నిక్ కి పీసీ అరుదైన కానుక‌

Update: 2022-06-21 02:30 GMT

ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట ఆద‌ర్శదాంప‌త్యం అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఈ జంట అన్యోన్య‌త న‌వ‌జంట‌ల‌కు గోల్ ని సెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్క్ లైఫ్ ని జాలీ రొమాంటిక్ లైఫ్ స్టైల్ తో ఎలా మ్యానేజ్ చేయాలో ప్రాక్టిక‌ల్ గా చూపిస్తోంది ఈ జంట‌. ఇటీవ‌లే స‌రోగ‌సీ ద్వారా ఒక బిడ్డ‌కు ఈ జంట జ‌న్మ‌నిచ్చింది.

ఇన్ని రోజులైనా కానీ బేబి ఫోటోలు వంద శాతం పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ తమ పాప మాల్తీ అమూల్యమైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.  దానితో పాటు అరుదైన నోట్ ని రాసారు.

జనవరి 2022లో ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ వారి మొదటి బిడ్డతో బ్లెస్సింగ్ అందుకున్నారు. ఈ జంట తమ కుమార్తెను అద్దె గర్భం ద్వారా స్వాగతించారు. ప్రియాంక - నిక్ జంట తమ కుమార్తెకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు.  ఇప్పుడు తమ మొదటి ఫాదర్స్ డేని తమ కుమార్తెతో జరుపుకున్నారు . ఇక ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా షేర్ చేసిన ఫోటోలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది ఏమిటో చెప్పాల్సిన ప‌ని లేదు.

డాడీ- డాట‌ర్ ద్వయం ధరించిన స్నీకర్స్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించాయి. వాటిపై డాడ్ ముమ్మాస్ అంటూ ఆంగ్ల అక్ష‌రాలు క‌నిపించాయి.  నిక్ జోనాస్ - మాల‌తీ మేరీ మ్యాచింగ్ స్నీకర్స్ ధరించి కనిపించారు. పసి పాపాయి బూట్లపై MM అని రాసి ఉండగా నిక్ బూట్ల‌పై MM s Dad అని రాసి ఉంది. ఇక ఈ ఫోటోలో కూడా ప్రియాంక చోప్రా తన కూతురి ముఖాన్ని దాచేయ‌డం విశేషం.

హ్యాపీ ఫ‌స్ట్ ఫాదర్స్ డే మై లవ్. మ‌న‌ చిన్న పాపాయితో నిన్ను చూడటం నాకెంతో గొప్ప ఆనందం.. ఇది ఎంత అద్భుతమైన రోజు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అని పీసీ ఆనందం వ్య‌క్తం చేసింది. నిక్ జోనాస్ కూడా అదే ఫోటోను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఇలా రాసాడు. నా చిన్న పాపాయితో మొదటి ఫాదర్స్ డే. నమ్మశక్యం కాని ఫాదర్ డాటర్ స్నీకర్లను కానుకిచ్చిన పీసీకి ధన్యవాదాలు. నన్ను డాడీని చేసినందుకు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఫాదర్స్ డే శుభాకాంక్షలు... అక్కడ ఉన్న తండ్రులు సంరక్షకులందరికీ శుభాకాంక్ష‌లు.. అని ఆనంద‌క‌ర‌ వ్యాఖ్య‌ను జోడించాడు.

ప్రియాంక చోప్రా -నిక్ జోనాస్ తమ అమ్మాయి పేరుగా మాల్తీ మేరీ చోప్రా జోనాస్ ని ఎంపిక చేసుకున్నారు. `మాల్తీ` అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. చిన్న సువాసనగల పువ్వు లేదా చంద్రకాంతి అని అర్థం. మేరీ అనే పదం లాటిన్ పదం `మారిస్` నుండి వచ్చింది. దీని అర్థం సముద్ర నక్షత్రం. మేరీ అనేది జీసస్ క్రైస్ట్ తల్లి మేరీ కి ఫ్రెంచ్ వెర్షన్.
Tags:    

Similar News