తను నటన మొదలుపెట్టిన రోజుల గురించి చెబుతూ ఉంది ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ గా నిలిచిన తర్వాత ఈమె బాలీవుడ్ సినిమాల వైపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరవై యేళ్ల కిందట మిస్ వరల్డ్ గా నిలిచింది ప్రియాంక. ఆ తర్వాత తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో తన ఉనికిని చాటుకుంది. వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారింది. కెరీర్ తొలి నాళ్లలోనే అటు గ్లామరస్ మరోవైపు నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ప్రియాంక వెనుకాడలేదు. అలాంటి ప్రయోగాలు ఆమెకు కలిసి వచ్చాయి.
ఐత్ రాజ్ సినిమాలో అయితే వేరే ఆవిడ భర్తను కామించే పాత్రను చేసింది ప్రియాంక. అలాంటి పాత్రలు చేయవద్దని తనకు కొంతమంది సూచించినట్టుగా ప్రియాంక చెప్పింది. అలాంటి పాత్రలు చేస్తే అదే ఇమేజ్ తనకు వస్తుందని వారు భయపెట్టారని ప్రియాంక చెప్పింది. అయినా తను భయపడకుండా అలాంటి సినిమాల్లో నటించినట్టుగా ఈ నటి వివరించింది. ఐత్ రాజ్ సినిమా ఈమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ సినిమా హిట్ అయ్యింది కూడా.
ఆ తర్వాతే ప్రియాంక కెరీర్ పుంజుకుంది. అలాగే తను సినిమా కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో హీరోలే తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎవరుండాలో డిసైడ్ చేసే పరిస్థితి ఉండేదని ప్రియాంక చెబుతూ ఉంది. అప్పట్లో హీరో కోరుకున్న హీరోయినే ఆయా సినిమాల్లో ఉండేదని అంటోంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నట్టుగా ప్రియాంక అభిప్రాయ పడింది. అయితే నిజంగానే ఆ పరిస్థితి మారిందా? అంటే.. కచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి అయితే ఉంది.