ఒక్కోసారి పరిస్థితి అంతే. కొంతమంది మంత్రులు రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చిన వెంటనే.. రకరకాలు కాంట్రోవర్సీల్లో అనుకోకుండా భాగమైపోతుంటారు. అసలు ఇలాంటి వివాదాల్లో భాగం కావడానికే వీరు లైమ్ లైట్ లోకి వచ్చేశారా అనిపిస్తుంటుంది. ఇప్పుడు డస్కీ బ్యూటి ప్రియాంక చోప్రా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆన్ లైన్ లో అమ్మడికి నెటిజన్లు రోజూ చుక్కలు చూపిస్తున్నారు.
అదిగో మొన్ననే ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని బెర్లిన్ (జర్మనీ)లో కలసినప్పుడు.. మోకాళ్ళ పైవరకు తొడలు కనిపించేలా డ్రస్సు వేసుకొచ్చిందని.. కనీసం ప్రధాన మంత్రిని కలిసినప్పుడైనా చాలా డీసెంట్ గా ఉండాల్సింది అంటూ సాటి అమ్మాయిలే ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. కట్ చేస్తే నిన్న జర్మనీలోని ఒక వార్ మెమోరియల్ దగ్గర ఫోటో దిగి సెల్ఫీ నెట్లో పెట్టింది. లక్షలమంది యూదులు చనిపోయినందుకు జ్ఞాపిక రూపొందిస్తే.. అక్కడ నవ్వుతూ ఫోజులు ఇస్తావా అంటూ ఆమెను నెట్టింట్లో చెడుగుడు ఆడేశారు. వెంటనే ప్రియాంక ఆ సెల్ఫీలను డెలీట్ చేసింది.
అంతకంటే ముందు అమ్మడు వీపరీతమైన క్లీవేజ్ ఎక్స్ పోజింగుతో చాలా హాలీవుడ్ ఈవెంట్లకు రావడంతో.. హాలీవుడ్ వెళ్ళి చెడిపోయిందంటూ అభివర్ణించారు. అలాగే ఆమె టూ పీస్ బికినీ వేసుకుని మేకప్ లేకుండా మియామీ బీచ్లో కనిపించడంతో.. ఆమె స్కిన్ టోన్ గురించి కూడా విమర్శనాత్మక ధోరణిలో పిడుగులు పడ్డాయ్. చూస్తుంటే చివరకు ప్రియాంక తుమ్మినా కూడా జనాలు నిప్పులు చెరిగేలా ఉన్నారే. కొంపతీసి ఆమెకు సడన్ గా ఇంటర్నేషనల్ ఫేం రావడంతో మనోళ్లు తట్టుకోలేకపోతున్నారా??
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/