భర్తను హీరోగా పరిచయం చేయబోతున్న హీరోయిన్‌

Update: 2021-12-02 05:33 GMT
సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం ఆరంభం నుండే జరుగుతోంది. అయితే ఈమద్య కాలంలో భర్తలు తమ భార్యలను మరియు భార్యలు తమ భర్తలను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. హీరోయిన్స్ అయితే వారి భర్తలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఉబలాట పడుతున్నారు. కాజల్ త్వరలోనే తన భర్త ను నటుడిగా పరిచయం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇద సమయంలో బాలీవుడ్‌ స్టార్ సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తన భర్త నిక్ జోనస్ ను బాలీవుడ్‌ కు పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన సోదరులతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ను నిర్వహిస్తున్న బాలీవుడ్‌ స్టార్స్ ను మించి నిక్ సంపాదిస్తున్నాడు. అయినా కూడా నిక్ కు బాలీవుడ్‌ సినిమాలపై ఆసక్తి ఉందట.

హీరోగా నిక్‌ తో ప్రియాంక చోప్రా ఒక సినిమా ను చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్‌ తో నిక్ ను పెద్ద బ్యానర్ లోనే ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. హీరోయిన్‌ గా ఇప్పటికి కూడా ఎంతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా భర్త నిక్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకోవడం ఆమె అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. నిక్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అలాంటి నిక్ బాలీవుడ్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.

ప్రియాంక చోప్ర కంటే నిక్ పదేళ్లు చిన్న వాడు అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన హీరోగా కెరీర్‌ ను ప్రారంభించడానికి సరైన సమయం. కనుక వచ్చే ఏడాదిలోనే నిక్ హీరోగా మొదటి సినిమా పట్టాలెక్కే అకవాశం ఉంది. నిక్ కు హాలీవుడ్‌ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది కనుక ఆయన బాలీవుడ్‌ సినిమా చేస్తే అక్కడ కూడా భారీగా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అంటే యూనివర్శిల్‌ సబ్జెక్ట్ తో సినిమా చేయాలని ప్రియాంక అభిమానులు కోరుకుంటున్నారు. మరి నిక్ మొదటి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News