సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరికి ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయి. కోట్లాది రూపాయిలు పారితోషికం తీసుకునే వారికి కూడా తీరని కోరికలు ఉంటాయా? అంటే ఉంటాయనే చెప్పాలి. తాజాగా ప్రియాంక విష్ లిస్ట్ ఇదే విషయాన్ని స్పస్టం చేస్తుంది. కోట్లాది రూపాయిల సంపాదన.. ఆర్థికంగా ఎలాంటి లోటు లేని జీవితం ఉన్నా.. కొన్నింటిని సొంతం చేసుకోవాలనుకునేవి ఉండటం ఆసక్తికరమే.
భర్త నిక్ ను పెళ్లాడిన తర్వాత అమెరికాలోనే ఉంటున్న ఆమె.. తాజాగా ఒక తెలుగు మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తనకున్న విష్ లిస్ట్ ను బయటపెట్టారు. ప్రేమించిన వారు చుట్టూ ఉంటే మనం ఎక్కడ ఉన్నామన్న విషయం పెద్దగా అనిపించదని చెప్పిన ప్రియాంక ప్రస్తుతం తన విష్ లిస్ట్ లో రెండు కోరికలు ప్రధానంగా ఉన్నాయని చెప్పింది
ఇటీవల ఆమె నటించి.. నిర్మించిన ‘ది స్కైజ్ ఈజ్ పింక్’ చిత్రం విడుదలైంది. మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా విషయాన్ని పక్కన పెడితే.. ప్రియాంక విష్ లిస్ట్ లో మొదటిది న్యూయార్క్ లో ఇల్లు కొనుక్కోవటంగా చెప్పింది. రెండోది తల్లి కావటమని పేర్కొంది.
మాతృత్వం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలని ఉందని.. అయితే అందుకు మరో రెండు మూడేళ్ల వరకూ ఉండదనే అనుకుంటున్నట్లు చెప్పింది. కోరిక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో? ఏమైనా.. ప్రియాంక విష్ లిస్ట్ త్వరలోనూ పూర్తి కావాలని కోరుకుందాం.