అశ్వినీ దత్‌ కూతురిని పెళ్లాడుతున్నా -నాగ్‌

Update: 2015-10-11 04:21 GMT
స్ర్కిప్టుల్లో త‌ల‌మున‌క‌లై డిష్క‌స‌న్ సాగించారు. ఆన్‌ సెట్స్ క‌లిసి ప‌నిచేశారు. క‌లిసి విజ‌య‌వంత‌మైన సినిమాని తెర‌కెక్కించారు. అక్క‌డితో ఆ అనుబంధం ముగిసిపోలేదు. ఏదో క‌మ‌ర్షియ‌ల్ బంధమేలే అన్న‌ట్టు వీగిపోలేదు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం కుదిరింది. ప్రేమ ప‌ల్ల‌వించింది. ఇంకేం ఉంది పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిలైపోవాల‌నుకున్నారు. ఇదంతా ఎవ‌రి గురించి? స‌్టార్ ప్రొడ్యూస‌ర్ త‌న‌యురాలు, లేడీ ప్రొడ్యూస‌ర్ ప్రియాంక ద‌త్‌ - ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్  ఈ ఇద్ద‌రి గురించే. ఈ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించారు. డిసెంబ‌ర్‌ లో ముహూర్తం అని చెబుతున్నారు. డీటెయిల్స్‌ లోకి వెళితే..

జగదేకవీరుడు అతిలోక సుందరి సహా ఎన్నో విజ‌య‌వంత‌మై చిత్రాలను నిర్మించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ అధినేత, నిర్మాత సి.అశ్వనీదత్ త‌న‌యురాలు.. ప్రియాంక ద‌త్ ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నాగ్ ఆశ్విన్ అని పెళ్లాడనున్నారు.  రీసెంట్ గా ప్రియాంక నిర్మించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన నిర్మాణ సారథ్యంలో నాగ్ ఆశ్విన్ ను పరిచయం చేసిన ప్రియాంక దత్ త‌న‌నే ఇష్ట‌ప‌డి పెళ్ళి చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ విష‌యంపై నాగ్ అశ్విన్ సైతం క్లారిటీనిచ్చారు.

ప్ర‌ఖ్యాత న్యూస్ ఏజెన్సీ ఐఎఎన్ ఎస్‌ తో అశ్విన్ ముచ్చ‌టిస్తూ .. అవును మేం డేటింగులు చేయ‌లేదు కానీ, మా మ‌ధ్య చ‌క్క‌ని స్నేహం ఉంది. 30 బార్డ‌ర్ క్రాస్ చేస్తోంది వ‌య‌సు. త‌నే ముందు ప్ర‌పోజ్ చేసింది. ఇంట్లో పెద్ద‌ల అంగీకారం కుదిరింది. పెళ్లి చేసేసుకుంటున్నాం.. అని అశ్విన్ చెప్పారు. అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల‌ఘుచిత్రం యాదోంకి బారాత్ ని ప్రియాంక ద‌త్ నిర్మించారు. ఆ త‌ర్వాత ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రాన్ని తెరెకెక్కించారు. అదీ సంగ‌తి.
Tags:    

Similar News