పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తెలంగాణాలో ఐదు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం ఇవ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పొద్దుపొద్దున్నే 'భీమ్లా నాయక్' బొమ్మ పడిపోయింది. అలానే టికెట్ ధర పెంపుదలలో వెసులు బాటు ఉండటంతో ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి.
ఏపీలో 'భీమ్లా నాయక్' కు ఇబ్బందులు తలెత్తాయి. అదనపు షోలకు అనుమతి లేదని థియేటర్ యాజమాన్యాలను రెవెన్యూ అధికారులు ముందుగానే ఆదేశించారు. జీవో నెం. 35 ప్రకారమే టికెట్ ధరలను వర్తింప చేయాలని నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ఇప్పటికే కరోనా పాండమిక్ వల్ల ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారని.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీరుతో మరింత నష్టపోతున్నామంటూ థియేటర్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సినిమా ప్రదర్శిస్తే తమకు కనీసం కరెంట్ చార్జీలు కూడా రావంటూ.. 'భీమ్లా నాయక్' ను తమ సినిమా హాళ్లలో ప్రదర్శించలేమంటూ థియేటర్ల గేట్ల వద్ద బోర్డులు పెట్టేశారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సొంత జిల్లా కృష్ణాతో పాటుగా గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్లలో ఈ పరిస్థితి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా టికెట్ ధర ప్రభుత్వ జీవో 35 ప్రకారం ప్రదర్శన గిట్టుబాటు కాదని.. సినిమా ప్రదర్శించడం లేదంటూ విస్సన్నపేటలో యాజమాన్యాలు బోర్డు పెట్టేశాయి. సినిమా వేయాలని పవన్ ఫ్యాన్స్ రాస్తారోకో చేయడంతో అర గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే మైలవరంలో 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శించే నారాయణ థియేటర్ ను తాత్కాలికంగా మూసివేశారని తెలుస్తోంది. చాలా చోట్ల థియేటర్స్ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. రూ.20 - రూ.15 - రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేస్తున్నారు.
థియేటర్ గేటు బయట ఇలాంటి నోటీసులు అతికించడంతో సినిమా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. జగన్ సర్కారు తమ అభిమాన హీరో మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో ఎగ్జిబిటర్స్ కు నష్టాలు వస్తే వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఇంకొన్ని ప్రాంతాల్లో పీకే ఫ్యాన్స్ హుండీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు ఇలానే మూతబడితే.. అవన్నీ రాబోయే రోజుల్లో కల్యాణ మండపాలుగా గోడౌన్స్ గా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.
ఇకపోతే తమను ప్రభుత్వం దొంగల్లా అవమానిస్తోందని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను దొంగల్లా అవమానిస్తూ థియేటర్ల వద్ద 15 మందిని కాపలా పెట్టి, దాడులు చేయడం తగదని అన్నారు. ఇది సినిమా నిర్మాతలు ఆర్టిస్టుల మీద జరుగుతున్న దాడి కాదు.. థియేటర్ వ్యవస్థ మీద దాడి అని పేర్కొన్నారు. థియేటర్ల మీద దాడుల వల్ల పవన్ కల్యాణ్ కు ఎలాంటి నష్టం ఉండదు.. ఎగ్జిబిటర్ వ్యవస్థకు నష్టమని అన్నారు.