నేచుర‌ల్ స్టార్ తో మైత్రీ రెబ‌ల్ ప్రొడ్యూస‌ర్‌!

Update: 2022-12-30 15:03 GMT
నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కుతున్న `ద‌స‌రా` మూవీలో న‌టిస్తున్నాడు. ఎస్ ఎల్వీ సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. సినిమాని వ‌చ్చే ఏడాది మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని త‌న 30వ ప్రాజెక్ట్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ఈ మూవీని ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ మూవీ ద్వారా వైరా ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తోంది. నాని కెరీర్ లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ మూవీ ఇది. ఇందులో నాని నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో స‌రికొత్త మేకోవ‌ర్ తో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న సాయంత్రం 4:05 నిమిసాల‌కు ప్ర‌క‌టించానున్నామ‌ని తెలిపింది.

ఈ మూవీతో మైత్రీ మూవీ మేక‌ర్స్ నుంచి విడిపోయిన మోహ‌న్ చెరుకూరి (సీవీఎమ్‌) త‌న స్నేహితులు విజ‌యేంద‌ర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె,ఎస్ ల‌తో క‌లిసి ఈ మూవీని వైరా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ 1 గా నిర్మించ‌బోతున్నారు. ఈ బ్యాన‌ర్ పై మంచి క‌థ‌ల‌ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. `శ్రీ‌మంతుడు` మూవీ నుంచి నానీ గ్యాండ్ లీడ‌ర్‌` వ‌ర‌కు మైత్రీతో సాగిన  మోహ‌న్ చెరుకూరి `ఉప్పెన‌` నుంచి మైత్రీకి దూరంగా వుంటూ వ‌స్తున్నారు.

ఇన్నాళ్ల‌కు మరో ఇద్ద‌రు మిత్రుల‌తో క‌లిసి కొత్త నిర్మాణ సంస్థ వైరా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ని స్టాపించి తొలి ప్ర‌య‌త్నంగా నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ప్రెస్టీజియ‌స్ మూవీతో నిర్మాణ రంగంలో కొత్త జ‌ర్నీకి శ్రీ‌కారం చుడుతుండ‌టం విశేషం. నాని 30వ ప్రాజెక్ట్ గా తెర‌పైకి రానున్నఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ని, ద‌ర్శ‌కుడిని  జ‌న‌వ‌రి న సాయంత్రం 4:05 నిమిషాల‌కు రివీల్ చేయ‌బోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News