మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన నాగవంశీ ఏకే రీమేక్ కు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. 'ఇందులో ఒకరు ఒకరు హీరో ఒకరు విలన్ అని కాకుండా ఇద్దరూ బ్యాలన్స్ చేయాల్సి ఉంటుంది.. హీరోల మధ్య ఈగో క్లాష్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ అవడానికి స్క్రీన్ ప్లే-డైలాగ్స్ త్రివిక్రమ్ రాస్తే బెటర్ అని అనుకున్నాం. సాగర్ యంగ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్, విజువల్ గా బాగా తీయగలుగతాడానే నమ్మకం ఉంది కాబట్టే డైరెక్టర్ గా పెట్టుకున్నాం. ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి త్రివిక్రమ్ అయితే బ్యాలన్స్ చేయగలడని అనుకున్నాం' అని చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ సినిమాలో తెలుగు నేటివిటీకి సెన్సిబిలిటీస్ కి తగ్గట్లు మార్పులు చేశాం. సోల్ మాత్రం మిస్ అవదు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ని పెడుతున్నామని అన్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని.. రానా సరసన ఐశ్వర్య నటిస్తోందని.. త్రివిక్రమ్ సలహా మేరకే మలయాళం రైట్స్ తీసుకున్నామని నాగవంశీ వెల్లడించారు. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయిందని.. 'పుష్ప' రిలీజ్ డేట్ చూసుకొని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు.