బాహుబలి పై కేంద్రానికి కంప్లయింట్

Update: 2015-11-28 16:20 GMT
బాహుబలి.. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత చిత్రం.. ఎన్నెన్నో రికార్డులు సృష్టించింది. 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి.. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రిలీజ్ అయింది. చాలా దేశాల్లో ఇండియన్ మూవీస్ కి కొత్త మార్కెట్ ఓపెన్ చేసింది. చరిత్రలో నిలిచిపోయే మూవీగా.. రికార్డులకెక్కింది. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఎన్నెన్నో ప్రశంసలు దక్కించుకుంది బాహుబలి.

అయితే. అంతర్జాతీయంగా ఇన్ని ప్రశంసలు దక్కించుకున్నా, దేశంలో మాత్రం సరైన గౌరవం కూడా దక్కలేదనే చెప్పాలి. రీసెంట్ గా గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. కనీసం ప్రదర్శనకు కూడా నోచుకోలేదు. అయితే ఇదేదో ప్రైవేటు కార్యక్రమమో.. ఏదైనా సంస్థ నిర్వహించే ఫంక్షనో కూడా కాదు. దీన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వమే. మరి ప్రభుత్వం ఫంక్షన్స్ చేసేదే.. దేశీయ సినీ పరిశ్రమ సత్తా ప్రపంచానికి చాటి చెప్పడానికి. ఇలాంటి కార్యక్రమంలో బాహుబలిని ప్రదర్శించకపోవడంపై... టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భ్గగుమన్నారు. దీనిపై కేంద్ర సమాచార మంత్రికి ఘాటుగా ఓ లేఖను కూడా రాశారు. తెలుగు సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నారని, అవమానిస్తున్నారని ఇందలుో వివరించారు. అయితే.. దీనికి కేంద్రం నుంచి కానీ, ఆ శాఖ నుంచి కానీ ఎలాంటి జవాబు రాలేదు. నిజానికి ఇలా తెలుగు సినిమాని అవమానం జరగడం.. ఇదే తొలిసారి కాదు. ఇలా పలు ప్రెస్టీజియస్ చిత్రాల విషయాల్లోనూ జరిగింది.

ప్రేక్షకుల మన్ననలు ఎన్నో పొందిన బాహుబలి.. అవార్డులు, వేదికలపై ప్రదర్శితం కాకపోవడంపై పెద్దగా ఫీల్ కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో బాహుబలిని ప్రదర్శిస్తామనే రిక్వెస్టులు బోలెడు వస్తున్నాయి. అయితే ఇంటర్నేషనల్ గా ఇన్ని కోట్ల మంది అభిమానం పొంది, వందల కోట్లు కొల్లగొట్టినా.. తెలుగు సినిమా అనే ఒక కారణంతో, బాహుబలిని కేంద్రం పట్టించుకోకపోవడంపై.. తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

Tags:    

Similar News