దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యామిలీ ఓస్థల వివాదంలో కోర్టు కేసు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని ఓ స్థలాన్ని ఇంటిని ఓ వ్యాపార వేత్తకు లీజ్ కు ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో లిగల్ వార్ మొదలైంది. తాజాగా అసలు వివాదం ఏంటి? అన్నది సదరు వ్యాపార వేత్త వివరించే ప్రయత్నం చేసారు.
`2014లో ఫిల్మ్ నగర్లోని ఓ ప్రాపర్టీని సురేష్ బాబు వద్ద లీజుకు తీసుకున్నాం. మొత్తం 2000గజాల ప్రాపర్టీ అది. సురేష్ బాబు..వెంకటేష్ పేరిట ఆ స్థలం ఉంది. ఆ స్థలం మొత్తం రెన్నోవేషన్ చేసి రెండు ప్లోరుల్లో హోటల్ ప్రారంభించాం. వ్యాపారం అప్పటికి బాగానే సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో 2016లో డ్రగ్స్ వివాదం తెరపైకి వచ్చింది.
అకున్ సబర్వాల్ టైమ్ లో రానాకి నోటీసులు వచ్చాయి. అయితే ఆసమయంలోనే కొండాపూర్ లో ఉన్న ప్రాపర్టీని సీల్ చేయాల్సింది..పొరపాటున మా ప్రాపర్టీని సీల్ చేసారు. తర్వాత ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా చూసారు. ఈ విషయం సురేష్ బాబు గారికి కి చెప్పాను. అప్పుడే ఆయన ప్రాపర్టీ అమ్మేస్తాను అన్నారు. నేను ఇప్పట్లో కొనలేను.
పైగా నాకు లీజ్ ఉంది. ఇప్పుడెలా అమ్ముతారు? అన్నాను. దానికి నా ఇష్టం..నా ప్రాపర్టీ అని జులం ప్రదర్శించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో మేము కూడా కొంటామని చెప్పాం. కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు. గజం ధర ఒక్కోసారి ఒక్కోలా చెప్పేవారు. పెంచడమే తప్ప తగ్గించేది లేకుండా మాట్లాడేవారు. మొదట్లో లక్షా ఇరవై వేలు చెప్పారు .
ఆ తర్వాత అదే స్థలం లక్షాయాభై వరకూ వెళ్లింది. 15 రోజులకు ఒకసారి పిలవడం బేరాలు ఆడటం..ఇలా మాట మీద నిలకడ లేకుండా మాట్లాడేవారు. మీరు పెద్ద వాళ్లు జెంటిల్ మ్యాన్ అనుకున్నా.. రోజుకొక రేట్ చెప్పడం భావ్యం కాదని నా భాగస్వామి అన్నారు. సురేష్ బాబు మాటలకు...చేతలకు సంబంధం ఉండదు. దీంతో ఖాళీ చేయండని మాకు లీగల్ గా నోటీసులు ఇచ్చారు.
మేము కూడా నోటీసులు ఇచ్చాం. ఫైనల్ గా పెద్దమనుషుల్లో కూర్చోబెట్టి మాట్లాడగా 1.80 లక్షలకి ఫిక్స్ చేసారు. కానీ సరిగ్గా అగ్రిమెంట్ ముందు ఒకటే ప్రాపర్టీ ఇస్తాను అన్నారు. దానికి ఒప్పుకున్నాను. ఇలా మాటలు మార్చడంతో ఒక ఎంవో ఇవ్వండని అడిగా. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంకటేష్ గారు స్థలానికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్ కూడా జరిగింది.
కానీ కొన్ని రోజులకి నాకంటే ఎక్కువ ఇచ్చే వాళ్లు ముందుకు వచ్చే సరికి నా అగ్రిమెంట్ మర్చిపోయి వాళ్లకు అదే స్థలాన్ని అగ్రిమెంట్ చేసారు. మరి మర్చిపోయి చేసారా? కావాలని చేసారా? నేను సెలబ్రిటీ కాదా? నన్నేం చేస్తారు? అన్న ధీమానా? అన్నది ఆయనకే తెలియాలని సదరు వ్యక్తి తెలిపారు. మరి ఈ వ్యాఖ్యలపై సురేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.