దిల్ రాజు బాగా బిజీ

Update: 2018-12-14 05:58 GMT
సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు కు 2018 ఓ పీడకలగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ యావరేజ్ కు తగ్గని స్థాయిలో అన్ని కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న దిల్ రాజు ఈ సంవత్సరం బాగా దెబ్బ తిన్నారు. విడుదల ఆలస్యమైనా కనీసం యూత్ అండదండలతో గట్టెక్కుతుంది అనుకున్న లవర్ దెబ్బ కొట్టగా ఫామిలీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు అని ఆశించిన శ్రీనివాస కళ్యాణం దారుణ ఫలితాన్ని అందుకుంది. హలో గురు ప్రేమ కోసమే అతి కష్టం మీద కొంతమేర బయటపడింది.  

అందుకే వచ్చే 2019లో గట్టిగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్లాన్స్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సంక్రాంతి కి వెంకటేష్ - వరుణ్ తేజ్ ఎఫ్2 మీద హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఇప్పటికీ ప్రీ రిలీజ్ టాక్ వచ్చేసింది. ఆ పై మూడు నెలలు తిరగ్గానే మహేష్ బాబు మహర్షి తో భారీ దండయాత్ర మొదలవుతుంది. దాని కన్నా ముందే తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ స్టార్ట్ అయిపోతుంది. శర్వానంద్ సమంతా కన్ఫర్మ్ అయ్యారు అని వినిపిస్తోంది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కాకుండా నాని తో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది. మరో హీరో గా దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందని ఇప్పటికే పెద్ద టాక్ ఉంది. మహేష్ బావ కొడుకు అశోక్ గల్లా ను తెరకు పరిచయం చేసే సినిమా కూడా వచ్చే ఏడాదే. మొత్తానికి 2018లో స్లో అయినా 19లో మాత్రం దిల్ రాజు జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం ఇప్పుడే కనిపిస్తోంది.
    

Tags:    

Similar News