మెగా ఫ్యామిలీ హీరోలంటే ఇష్టం, అభిమానం అంటూనే రామ్ గోపాల్ వర్మ వెటకాపు మాటలతో టార్గెట్ చేస్తూ వివాదాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, చిరంజీవిలని టార్గెట్ చేస్తూ వర్మ పెడుతున్న పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే వర్మ గతంలో పెట్టిన ఓ పోస్ట్ కి `భీమ్లా నాయక్` టీమ్ నుంచి గట్టి కౌంటర్ రాబోతోంది.
వివరాల్లోకి వెళితే.. గత కొన్ని నెలలుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ `భీమ్లా నాయక్` రిలీజ్ పై వరుస ఆసక్తికర కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కి జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో `ఆర్ ఆర్ ఆర్`.. `రాధేశ్యామ్` చిత్రాల కారణంగా వాయిదా పడింది.
ఇటీవల ఆర్ ఆర్ ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాల రిలీజ్ డేట్ లు ఫైనల్ కావడంతో `భీమ్లా నాయక్` మేకర్స్ ఈ మూవీ కోసం రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించారు. మార్చి 25 లేదా ఏప్రిల్ 1న మా చిత్రాన్ని విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ స్టార్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణం మొదలైంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి ఏపీ సీఎంని టికెట్ రేట్లతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలపై ప్రత్యేకంగా భేటీ కావడం.. అటు నుంచి సానుకూల స్పందన రావడంతో `భీమ్లా నాయక్` రిలీజ్ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడిందని చెబుతున్నారు.
మరో వారం, పది రోజుల్లో ఏపీ ప్రభుత్వం టికెట్ విధానంపై కొత్త జీవోని విడుదల చేయనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో `భీమ్లా నాయక్` రిలీజ్ కు సంబంధించిన తాజా అప్ డేట్ త్వరలో రాబోతోందని స్పష్టంగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించాలనే సన్నాహాల్లో మేకర్స్ వున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ నుంచి మరో బ్రేకింగ్ అప్ డేట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు రచనా సహకారం అందించిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ లోనూ విడుదల చేయబోతున్నారని తెలిసింది.
ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. దీంతో రామ్ గోపాల్ వర్మపై సెటైర్ లు పేలడం మొదలైంది. `సర్దార్ గబ్బర్ సింగ్` చిత్రాన్ని హిందీలో విడుదల చేయవద్దని తాను కోరానని, నా మాట వినిపించుకోకుండా హిందీలో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారని, అయితే ఇప్పుడు `భీమ్లా నాయక్` ని హిందీ రిలీజ్ చేయాలని వర్మ గతంలో వ్యంగ్యంగా చేసిన ట్వీట్ లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ `భీమ్లా నాయక్` హిందీలోనూ విడుదలవుతుందిని క్లారిటీ ఇవ్వడంతో పవన్ విషయంలో వర్మ కోరిక నిజమవుతోందని, ఈ మూవీ రిలీజ్ విషయం తెలిసి వర్మ ఎలా రియాక్ట్ అవుతాడోనని కొంత మంది చెప్పుకుంటున్నారు. ప్రచార కర్తగా మారతాడా? లేక తను కోరినట్టే హిందీలో రిలీజ్ చేస్తున్నారని వర్మ సైలెంట్ అవుతాడా? అన్నది తెలియాలంటే `భీమ్లా నాయక్` హిందీ వెర్షన్ రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే.