వాటీజ్ దిస్ మేడం?

Update: 2018-09-12 06:38 GMT
సినిమా పరిశ్రమలో ఊహించని సక్సెస్ వరించినప్పుడు ఒకోసారి ఆనందం గర్వానికి దారి తీస్తుంది. మనవల్లే  సినిమా ఆడిందనే భ్రమలో ఉన్నంత కాలం అంతా మనమనుకున్నట్టే జరగాలనిపిస్తుంది. ఈ ఏడాది రెండు హిట్లతో అమాంతం రేంజ్ పెరిగిపోయిన ఓ హీరోయిన్ విషయంలో ఇప్పుడు ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుణ్యమా అని వంద కోట్ల విజయంలో తనకూ భాగమున్నందుకు స్టార్ డమ్ బాగా తలకెక్కిందా అంటే నిజమేనంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.  ఇప్పటికే వివాహానికి సంబంధించిన వివాదం తాలూకు హెడ్ లైన్స్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ  షూటింగ్ స్పాట్స్ లో చెబుతున్న గొంతెమ్మ కోర్కెల లిస్ట్ చూసి నిర్మాతల గుండెలు జారిపోతున్నాయట. విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ షూట్ గ్యాప్ ఏదైనా కారణం వల్ల రెండు రోజుల కంటే ఎక్కువ వస్తే వెంటనే ఇంటికి వెళ్లిపోవడానికి ఈ బ్యూటీ మొగ్గు చూపిస్తోందట. వాటి తాలూకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ చార్జీలు నిర్మాతలే భరించాల్సి రావడంతో ఈ ఖర్చు పెను భారంగా మారిందని ప్రొడ్యూసర్లు వాపోతున్నారు.

ఇటీవల కాలంలో ఆ బ్యూటీ సినిమా ఒకటి  విదేశాల్లో షూటింగ్ చేసుకుంది. అప్పుడే తన వల్ల ఈ సమస్య వచ్చినట్టు చెబుతున్నారు. రెండు రోజులు కాదు నాలుగైదు రోజులు వచ్చినా హీరోతో సహా అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇండియాకు వెళ్లి మళ్ళి రారని కానీ ఈ అమ్మడు మాత్రం కేవలం ఇంట్లో వాళ్ళను చూడాలనిపిస్తోందనే కారణం చూపించి వెళ్లడం బాగా ఇబ్బందులకు గురి చేసిందని వినికిడి. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలాంటి టాక్ ద్వారా అవకాశాలకు కళ్లెం వేసుకోవడం ఖాయమంటున్నారు దర్శక నిర్మాతలు. ఎన్ని సక్సెస్ లు వచ్చినా విధేయంగా ఉండే హీరోయిన్లకు కొదవ లేని పరిశ్రమలో ఇలా ఒక్క బ్లాక్ బస్టర్ తోనే సర్వం నేనే అనే రీతిలో ప్రవర్తిస్తే ఎలా అంటున్నారు. ఇది  నిజమో కాదో కానీ నిప్పు లేనిదే పొగరాదు సామెత  తరహాలో వెంటనే కొట్టిపారేయడానికి వీలు లేని ఇలాంటి వార్తలు నిజమైతే కనక సదరు హీరోయిన్  గారు అలెర్ట్ కావడం బెటర్.

    

Tags:    

Similar News