ఒక్క‌డినే వ‌స్తా..ట‌చ్ చేయ్ వ‌ర్మ‌ చూస్కుందా:న‌ట్టికుమార్

Update: 2022-04-08 15:30 GMT
గ‌త రెండు రోజులుగా ద‌ర్శ‌క‌-నిర్మాత‌ రాంగోపాల్ వ‌ర్మ‌- నిర్మాత న‌ట్టి కుమార్ మ‌ధ్య వివాదం మీడియాలో హాట్ టాపిక్ గామారిన సంగ‌తి తెలిసిందే. ఇరువురు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌నీ వ్య‌వ‌హారం ప‌తాక స్థాయికి రావ‌డంతో  వివాదం తారా స్థాయికి చేరింది. నిన్న‌టి రోజున వ‌ర్మ..న‌ట్టికుమార్ ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

``నట్టి కుమార్‌ ఓ సోల్లుగాడుని.. పానకంలో పుడక లాంటోడని వ‌ర్మ   ఫైర్ అయ్యారు. `డేంజరస్` సినిమా వాయిదాకు నట్టి కుమార్‌ కారణం కాదని.. దానికి ఇతరు కారణాలు ఉన్నాయని వర్మ అన్నారు. తాను రూ.5 కోట్లు మోసం చేసానని నట్టి చెబుతున్నాడని.. దానిపై లీగల్‌ గా వెళతానంటూ సమాధానం ఇచ్చారు. రెండు రోజుల నుంచి తనను నట్టి కుమార్‌.. డిస్టర్బ్  చేస్తున్నాడని..తన గురించి ఇక మాట్లాడబోనని అన్నారు. ఎప్పుడు ప్రెస్‌ మీట్లు పెట్టి.. ఇలాగే సోల్లు వాగుతాడని నట్టి కుమార్‌ పై వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ గా న‌ట్టి కుమార్ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో వ‌ర్మ‌కి న‌ట్టి స‌వాల్ విసిరారు.

``ఆర్జీవీని డైరెక్ట‌ర్ అన‌డం కూడా వేస్ట్ . వాడొక చీట‌ర్.  ఒక్క‌డిగా గా వ‌స్తే దేనికైనా రెడీ అని స‌వాల్ విసిరాడు. నువ్వు మ‌గాడివైతే..నీకు ద‌మ్ముంటే నేను ఒక్క‌డినే వ‌స్తా. ఓసారి నీ ఆఫీస్ కి  ఐదుగురు ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌స్తే జైలులో వేయించాయివు. 100 మందిని తెచ్చి ఆర్జీవీ అని జిందాబాద్  కొట్టించుకున్నావ్. నువ్వు ఇప్పుడు నీ మంది మార్భ‌లాన్ని పిలిపించుకో. నువ్వే ప్లేస్ చెప్పు. నేను ఒక్క‌డినే వ‌స్తా. నీకు ద‌మ్ము ఉంటే నా ఒంట‌ మీద ట‌చ్ చేసి చూడు. నీ  ఫ్యాన్స్ నైనా ట‌చ్ చేసి చూడ‌మ‌ను.

అదే జ‌రిగితే నీ కాళ్ల కింద దూరి వెళ్లిపోతా. ఇది నా ఛాలెంజ్..స‌వాల్.. మూడు రోజుల్లో నాకు టైమ్..ప్లేస్ చెప్పు. నా అడ్వ‌కేట్ శ్యామ్ అగ‌ర్వాల్. లీగల్  గా ఏదైనా ఆయ‌నే చూసుకుంటారు. నా పిల్ల‌లు నిన్ను ఎప్పుడో రిజెక్ట్ చేసారు. మా పిల్ల‌లు నిన్ను పిలిస్తే మా ప‌రువు పోతుంద‌న్నారు. నీ క‌న్నా నా పిల్ల‌లు సినిమాలు బాగా ఆడాయి. నువ్వు చేసిన  సినిమా `దిశ` ఎన్ కౌంట‌ర్ అయిపోయింది. నా సినిమాకి మినిమం షేర్లు వ‌చ్చాయి. నా సినిమా క‌లెక్ష‌న్లు చూసి సిగ్గుతో త‌ల‌దించుకోవాలి.

నాడ‌బ్బు నాహ‌క్కు. అప్పు తీసుకుని ఇస్తాన‌ని మోసం చేసావ్. నువ్వు మ‌గాడివైతే ముంబైలో 500 కోట్ల ఖరీదు గ‌ల ఆఫీస్ ఉన్నాద‌న్నావ్? మ‌రి అక్క‌డ  నుంచి రాత్రికి రాత్రే ఎందుకు పారిపోయాయి వ‌చ్చేసావ్? ఆ ఆఫీస్ కి ఎందుకు తాళం వేసావ్? మ‌ళ్లీ ఆ ఆఫీస్ తెరిచి సాయంత్ర వ‌ర‌కూ కూర్చోగ‌లిగితే..అప్పులు వాళ్లు రాక‌పోతే నువ్వు ఏది చెబితే అది నేను చేస్తా. మ‌ళ్లీ న‌న్ను గెల‌క‌కు. నీ చ‌రిత్ర మొత్తం బ‌య‌ట‌పెడ‌తా. వీడియోల‌తో బ‌య‌ట‌కు తెస్తా. నీకున్న అప్పులు 100 కోట్లు.

సోమ‌వారం బాధితులంతా  ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు వ‌స్తారు. వాట‌లికి  బినామీగా ఉన్న తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కూడా డ‌బ్బులు క‌ట్టాల్సిందే. రాస‌త్య‌నారాయ‌ణ ఆస్తుల‌కి వ‌ర్మ వార‌సుడు. అంద‌రి అప్పుల‌కు ఛాంబ‌ర్ త‌రుపున రామ స‌త్య‌నారాయ‌ణ బాధ్య‌త వ‌హించాల్సిందే. చిరంజీవి..సురేష్ బాబుని తిట్టాన‌ని అంటావ్.  వాళ్ల‌ని తిట్ట‌లేదు..అవ‌మానించ‌లేదు. ఇష్యూ బేస్డ్ పైనే మాట్లాడాను. నువ్వు ఏకంగా వాళ్ల ఫ్యామిలీ విష‌యాలే కెలికావు. నేను మ‌గాడిగా బ్ర‌తికాను..మ‌గాడిగానే చ‌చ్చిపోతాను. శ్రీరంగ నీతి క‌బుర్లు నాకు చెబుతావా. నీ ఇంటి మీద‌కి ఎంత మంది రాలేదో నాకు తెలియ‌దా? అన్ని మూస్కుని నీ ప‌ని నువ్వు చూసుకో`` అని మండిప‌డ్డారు.
Tags:    

Similar News