`శ్రీదేవి సోడా సెంటర్` ఒక రాజీ లేని ప్రయత్నం!-నిర్మాతలు విజయ్-శశి
సుధీర్ బాబు - ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం -శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా-శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నేడు (27 ఆగస్ట్) ఈ సినిమా చక్కని అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. కరోనా క్రైసిస్ లోనూ మాస్ జనాల్ని థియేటర్ల వైపు అడుగులు వేయించే కంటెంట్ ఉన్న సినిమాగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది.
తాజాగా ఈ సినిమా విజయం పై నిర్మాతలు విజయ్ చిల్లా-శశిదేవి రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ-``ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రం. మంచి యాంబిషన్ తో సంతోషంగా జీవించే ఇద్దరు యంగ్ స్టర్స్ కథ తో తెరకెక్కింది. నాటి జనరేషన్ లో యుత్ ఫుల్ ప్రోగ్రోస్సివ్ నెస్ నేపథ్యంలో సంఘర్షణ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది ఎమోషనల్ లవ్ స్టోరి. ప్రతి ఒక్కరూ పెద్ద తెరపై వీక్షించదగిన గొప్ప సినిమా. ట్రైలర్ తోనే సినిమాపై హైప్ పెరిగింది. గొప్ప ప్రతిభావంతమైన టీమ్ ఈ సినిమాకి పని చేసింది. మా దర్శకుడు కరుణ కుమార్ హార్డ్ వర్క్.. స్టైలిష్ హీరో సుధీర్ బాబు నటన.. సినిమాకి ప్రధాన అస్సెట్స్. ఈ సినిమాని సాంకేతిక విలువల మరో లెవల్ కి తీసుకెళ్లాయి.
ప్రతిసారీ కథని నమ్మి సినిమాలు నిర్మిస్తోంది 70ఎం.ఎం సంస్థ. ఇప్పుడు కూడా కథను నమ్మి సినిమా తీశాం. విజయం అందుకున్నాం`` అని తెలిపారు.
కథ విషయంలో ఎప్పటికీ రాజీకి రాకుండా సినిమాలు తీస్తామని 70ఎంఎం అధినేతలు వెల్లడించారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా విజయంపై నిర్మాతలు ధీమాను వ్యక్తం చేశారు. హార్డ్ వర్క్ తో సినిమా అద్భుతంగా రావడానికి సహకరించిన టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.