టాలీవుడ్ లో ఇటీవల ఊహించని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓవైపు కార్మికులు తమకు భత్యాలు పెంచాలంటూ బంద్ కి సిద్ధం కాగా.. దానికి కౌంటర్ గా తామే షూటింగులు ఆపేస్తామంటూ నిర్మాతలు ఎదురుతిరిగారు.
కానీ ఏం జరిగిందో కానీ షూటింగులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఇంతలోనే నిర్మాతలు షూటింగులను నిలిపేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారంటూ ఒక ప్రచారం వేడెక్కిస్తోంది.
కాస్ట్ కంట్రోల్ తో పాటు జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు ఏం చేయాలి? అన్నదానిపై నిర్మాతలు ఇతర కీలక విభాగాలతో చర్చించనున్నారు. ఈలోగానే ఆగస్ట్-1 నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్ లు ఆగిపోతాయని ఇటీవల పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ రూమర్ లకు పరోక్షంగా తెరదించుతూ తెలుగు నిర్మాతల మండలి మీడియాకి అధికారిక ప్రకటన జారీ చేసింది.
నిర్మాతలు.. పంపిణీదారులు.. థియేటర్ యజమానులు.. స్టూడియో ఓనర్లు.. ఓ చోట సమావేశం అవుతారు.. దీనికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిసింది. తాము తీసుకున్న నిర్ణయాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసే వరకు పుకార్లను నమ్మవద్దని అభ్యర్థించారు.
తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్మాతలు సినిమా షూటింగ్ లను యథాతథంగా కొనసాగించవచ్చని మండలి ఈ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆగస్ట్-1 నుంచి టాలీవుడ్ సినిమా షూటింగులను నిలిపేస్తుందన్న ఊహాగానాలకు తెరపడింది.
కార్మికుల భత్యాలతోనే సమస్య కాదు.. నిర్మాణ వ్యయం ఇటీవల అమాంతం రెట్టింపైంది. దీంతో నిర్మాతలు చాలా కలతకు గురవుతున్నారు. ఓవైపు ఓటీటీ టీవీ రంగాలు పుంజుకోవడంతో అది థియేటర్లకు వచ్చే వారి సంఖ్యను తగ్గించేస్తోంది. వీటన్నిటిపైనా అన్ని సెక్టార్ల ప్రముఖులు చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారని కథనాలొస్తున్నాయి.