'నేనే రాజు నేనే మంత్రి' సీక్వెల్‌!?

Update: 2018-09-05 01:30 GMT
రానా క‌థానాయ‌కుడిగా న‌టించిన `నేనే రాజు నేనే మంత్రి` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. లీడ‌ర్ త‌ర్వాత డిఫ‌రెంట్‌ పొలిటిక‌ల్ కాన్సెప్టుతో రానా న‌టించిన చిత్ర‌మిది. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా చూపించిన‌ పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్‌ ప్రేక్ష‌కాభిమానుల్ని ఆక‌ట్టుకుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ తో క‌లిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాజ‌ల్ ఈ చిత్రంలో రానా భార్య పాత్ర‌లో న‌టించింది. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంతోనే తేజ కెరీర్ ప‌రంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ అంటే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంది.

గ‌త కొంత‌కాలంగా నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్‌ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఒక‌వేళ సీక్వెల్ చేసే ఆలోచ‌న ఏదైనా ఉందా? అంటే చేసే అవ‌కాశం ఉంద‌ని తేజ అన్నారు. అయితే ఆ త‌ర్వాత వెంకీతో వేరే ప్రాజెక్టుతో అత‌డు బిజీ అవ్వ‌డంతో అప్ప‌టికి కామ‌ప్ అయిపోయింది. అదంతా స‌రే.. అస‌లు ఈ సినిమాకి సీక్వెల్ ఉందా లేదా? అంటూ నిర్మాత‌ల్నే ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. పీపుల్స్ మీడియా అధినేత‌లు భ‌ర‌త్ - కిర‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. ఈ సినిమాకి సీక్వెల్ గురించి ఇంకా ఆలోచించ‌లేద‌ని - తేజ‌ - సురేష్‌ బాబు సిద్ధంగా ఉంటే చేస్తామ‌ని తెలిపారు. సీక్వెల్ చేసేందుకు ఆస‌క్తిగానే ఉన్నామ‌ని అన్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై చ‌ర్చ సాగ‌లేద‌న్నారు.

ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు ఉంద‌ని వార్త‌లొచ్చాయి క‌దా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు భ‌ర‌త్ - కిర‌ణ్ స‌మాధాన‌మిచ్చారు. ఎన్టీఆర్‌ తో అనుకోలేదు. కానీ పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాం. `సిల్లీ ఫెలోస్` రిలీజ్ త‌ర్వాత దానిపైనా క్లారిటీ ఇస్తామ‌ని తెలిపారు. తాజా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టితీర‌తామ‌ని స‌ద‌రు నిర్మాత‌లు కాన్ఫిడెన్స్ వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News