టైర్ టు హీరోస్ తో జాగ్ర‌త్త‌ప‌డుతున్న ప్రొడ్యూస‌ర్స్‌!

Update: 2022-08-19 05:00 GMT
టాలీవుడ్ సినిమా గురించి మాట్లాడు కోవాలంటే క‌రోనాకి ముందు త‌రువాత అని మాట్లాడుకోవాల్సిందే. కార‌ణం కోవిడ్ త‌రువాత ఫిల్మ్ మేకింగ్ లో కానీ, ప్రేక్ష‌కుడిని మెప్పించే కంటెంట్ విష‌యంలో కానీ, బ‌డ్జెట్ ల విష‌యంలో కానీ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దీనికి త‌గ్గ‌ట్టే ప్రేక్ష‌కుల‌లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు స్టార్ డ‌మ్‌.. స్టార్ ఇమేజ్ ప‌ని చేయ‌డం లేదు. కంటెంటే హీరో.. కంటెంట్ త‌రువాతే ఎవ‌రైనా అనే స్థాయికి తెలుగు సినిమా వ‌చ్చేసింది.

తెలుగు ప్రేక్ష‌కుడు కూడా మ‌రిపోయాడు. కంటెంట్ లేదంటే ఎంత గొప్ప స్టార్ సినిమాని అయినా ప‌క్క‌న పెట్టేస్తున్నాడు. దీంతో కొంత మంది టైర్ టు హీరోల‌కు క‌ష్ట‌కాలం మొద‌లైంది.  కొంత మంది టైర్ టు హీరోస్ వీళ్లంతా గొప్ప‌గా మాదే స్టార్ ఇమేజ్ ..

మా ఇమేజ్ వ‌ల్లే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని ఫీల‌వుతూ వుంటారు. భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్స్ డిమాండ్ చేస్తుంటారు. అంత త‌మ వ‌ల్లే అంటూ ఏదో హ‌డావిడీ చేస్తుంటారు.. కానీ వీళ్ల సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూస‌ర్ల‌కు 80 నుంచి 90 శాతం వ‌ర‌కు డ‌బ్బులు పోతున్నాయి.

ఏ విష‌యంలోనూ రిట‌ర్న్స్ వుండ‌టం లేదు. విచిత్రం ఉంటంటే ఇలాంటి సినిమాలు చూడ‌టానికి కూడా ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీని వ‌ల్ల టైర్ టూ హీరోల్లో చాలా వ‌ర‌కు హీరోలు ఔట్ డేటెట్ గా ఆలోచిస్తున్నారా? .. లేక ఔట్ టేడెట్ అయిపోతున్నారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టైర్ టు హీరోల్లో న‌లుగురైదుగురు హీరోల సినిమాలు డిజాస్ట‌ర్ లుగా నిలిచినా స‌రే ప్రేక్ష‌కులు వారి సినిమాల కోసం థియేట‌ర్ల‌కు వ‌స్తుంటారు.

కానీ కొంత మంది టైర్ టు హీరోల సినిమాల‌ని మాత్రం ప్రేక్ష‌కులు క‌న్నెత్తి కూడా చూడ‌ని పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి హీరోల‌ని న‌మ్ముకుని కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రించి సినిమాలు చేయాలంటే ఇప్పుడు నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ట‌. అంతే కాకుండా వీరి మార్కెట్ ని చూసి భ‌య‌ప‌డుతున్నారట‌.

కొంత మంది మాత్రం  టైర్ టు హీరోస్ తో సినిమాల విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డుతున్నార‌ట‌. టైర్ టు హీరోస్ హీరోయిజం వ‌ల్ల‌.. స్టార్ ప‌వ‌ర్ వ‌ల్ల థియేట‌ర్ల‌లో టికెట్ లు తెగ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఇలాంటి టైర్ టు హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ప్రొడ్యూస‌ర్ లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌.
Tags:    

Similar News