ఇండస్ర్టీలో నెలకొన్న అన్ని సమస్యలకి సినిమా నిర్మాణం బంద్ ఒక్కటే మార్గమా? దశాబ్ధాలుగా విసిగిపోతన్న నిర్మాతలు చివరి అస్ర్తాన్ని సంధించడానికి రెడీ అవుతున్నారా? ఆగస్టు నుంచి సినిమా నిర్మాణం పూర్తిగా ఆగిపోనుందా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఇండస్ర్టీలో తలెత్తిన అనిశ్చితి గురించి తెలిసిందే.
హీరోలు భారీగా పారితోషికాలు పెంచేయడం.. వాళ్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు రెమ్యునరేషన్ పెరిగిపోవడం..కార్మికుల వేతనాల డిమాండ్ ఇలా ప్రతీది నిర్మాతకి సంకటంగా మారింది. సినిమా నిర్మాణం భారీగా పెరిగిపోవడం సహా ఇటీవలి కాలంలో థియేటర్లకి ప్రేక్షకులు తగ్గిపోవడం..ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎగ్జిబిటర్ల అసహనం ఇలా ఎన్నో సమస్యలతో పరిశ్రమ నలిగిపోతుంది.
వాస్తవానికి చాలా కాలంగా నిర్మాతలు వాటిలో కొన్ని రకాల సమస్యలతో తరుచూ బాధపడుతన్నదే అయినప్పటికీ ప్రధానం పారితోషికాలు పెరిగిపోవడం నిర్మాణం ఇబ్బందిగా మారిందని చాలా మంది నిర్మాతలు లబోదిబో మన్నారు. నిర్మాతలు హీరోల దారిలోకి వెళ్లాలి తప్ప.. నిర్మాతల దారిలోకి హీరోలు వచ్చింది ఏనాడు జరగలేదు.
హీరోల ఇమేజ్ తో నడిచే వ్యాపారం కాబట్టి నిర్మాత డబ్బు పెట్టినా నోరు మొదపడానికి ఛాన్స్ ఉండదు. టాలీవుడ్ లో కొన్ని దశాబ్ధాలుగా ఉన్న సమస్య ఇది. ఈ విషయంలో దివంగత దర్శక-నిర్మాత దాసరి నారాయణరావు చాలాసార్లు హీరోల్ని హెచ్చరించినప్పటికీ ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు. ఆయన ఉన్నంత కాలం నిర్మాతల పక్షాన నిలబడి ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించారు గానీ...హీరోల పారితోషికాల విషయంలో మాత్రం ఏమీ చేయలేని సన్నివేశమే కనిపించింది.
ఇక విసిగివేసారిన నిర్మాతలు ఈ విషయంలో చివరి అస్ర్తాన్ని సంధించాడనికి రెడీ అయ్యారు. సినిమా నిర్మాణాన్ని ఉన్న పళంగా నిలిపివేసి దీనికొక పరిష్కారం చూపాలని బలంగా సంకల్పించారు. దీనిపై త్వరలోనే ఓ కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో నిర్మాతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తారల పారితోషికాలు..ఇతర వేతనాలు మొదలుకుని ఇండస్ర్టీ లో ఉన్న అన్ని సమస్యలపై చర్చించారు.
తాజా విషయాలన్నింటిపై మరో వారం రోజుల్లో మళ్లీ సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్ ఆపేయడమే ఉత్తమంగా కనిపిస్తుందని చాలా మంది నిర్మాతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే గనుక జరిగితే టాలీవుడ్ చరిత్రలో ఈ నిర్ణయం సంచలనమే అవుతుంది.
హీరోల పారితోషికాలు కారణంగా ఇంతవరకూ ఏనాడు నిర్మాతలు షూటింగ్ బంద్ పెట్టలేదు. అయ్యా...బాబు అని కాకపటే సన్నివేశమే కనిపించిందిగానీ..హీరోలకు వ్యతిరేకంగా వెళ్లింది లేదు. ఈసారి హీరోల్ని సైతం బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఈ పోరాటంలో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.