ప్రభాస్ ప్రాజెక్ట్ K .. అవ‌తార్ ఫార్మాట్ లో విజువ‌ల్ వండ‌ర్ అనిపించేలా!

Update: 2021-07-29 03:58 GMT
ప్రాజెక్ట్.కె .. ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతున్న సినిమా. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. హాలీవుడ్ మూవీ ఐ రోబో రేంజులో అవ‌తార్ టెక్నిక్స్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొనే- వాణీ క‌పూర్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాయి. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని కోడలు సమంతతో కూడా చర్చలు జరుపుతున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఇంకా భారీ కాస్టింగ్ నాగ్ అశ్విన్ టీమ్ లో చేరేందుకు వీలుంద‌ని తెలుస్తోంది.

భారత‌దేశంలోనే నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే ప్రాజెక్ట్ ఇది. అత్యంత భారీ కాన్వాసుపై తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మెజారిటీ భాగం కేవ‌లం సెట్స్ లోనే పూర్తి చేస్తారు. అందుకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ల‌ను డిజైన్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశం కాబ‌ట్టి విజువ‌ల్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్య‌త ఉంద‌ని తెలుస్తోంది. కేవ‌లం గ్రాఫిక్స్ కోస‌మే 200 కోట్లు పైగా ఖ‌ర్చు చేస్తార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ ఇటీవ‌ల హైద‌రాబాద్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. బిగ్ బిపై స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌దుప‌రి డార్లింగ్ ప్రభాస్ ఈ టీమ్ తో చేరనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో తీర్చిదిద్దిన సెట్ల‌లోనే ఏకంగా 90శాతం  సినిమాని చిత్రీకరిస్తారు.

దీనికోసం క‌ళాద‌ర్శ‌కుడితో క‌లిసి ప్రొడక్షన్ డిజైనింగ్ బృందం ఇప్పటికే  మ‌తి చెడే రేంజులో అత్యంత భారీ సెట్స్ ని తీర్చిదిద్దుతున్నార‌ని తెలిసింది.

ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ వ‌ల్ల స్టార్ల‌కు చాలా మేలు జ‌ర‌గ‌నుంది. ఎందుకంటే మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ కేవ‌లం ఒకే సైట్ లో జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆ మేర‌కు ప్ర‌యాణాలు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. బిగ్ బి స‌హా దీపిక ప‌దుకొనే హైద‌రాబాద్ నుంచి ముంబైకి ప్ర‌తిసారీ ప్ర‌యాణించే రిస్క్ కూడా ఉండ‌దు. అక్క‌డే వారికి స‌క‌ల సౌకర్యాల‌తో బ‌స‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే కోవిడ్ ప్రోటోకాల్ ను క‌చ్చితంగా పాటించవచ్చు. ఎందుకంటే షూటింగ్ నియంత్రిత సంఖ్య‌లో న‌టీన‌టులు వ‌ర్క‌ర్స్ మ‌ధ్య ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జరుగుతుంది.

అవ‌తార్ టెక్నిక్స్ తో...

ఇంత‌కుముందు జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన అవతార్ కోసం గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ ని అనుస‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో పండోరా గ్ర‌హం ఒక అద్భుత సృష్టి. అవ‌తార్ ల క‌ద‌లిక‌లు స‌హా ప్ర‌తిదీ గ్రీన్ మ్యాట్ బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ చేసి ఆ త‌ర్వాత గ్రాఫిక్స్ తో తీర్చిదిద్దిన‌వే. పండోరా గ్ర‌హంపై వింత‌లు విశేషాలు.. అవ‌తార్ ల సంచారం.. యుద్ధాలు.. ప్ర‌తిదీ గ్రాఫిక్స్ వీఎఫ్ ఎక్స్ మాయ. ఇప్పుడు అదే ఫార్మాట్ లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ప్రభాస్-  దీపికా పదుకొనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం మ‌హాన‌టి ఫేం డానీని ఛాయాగ్రాహ‌కుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసుకున్నారు. డానీ యూరోపియన్ దేశం నుండి వచ్చారు. అయినా తెలుగు భాష సంస్కృతిని అర్థం చేసుకుని మ‌న‌దైన నేటివిటీ ట‌చ్ ని తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌ల నిపుణులు. మ‌న సినిమాని ప్ర‌పంచ‌స్థాయికి చేర్చేందుకు స‌రికొత్త అన్వేష‌ణ సాగుతున్న క్ర‌మంలో అతడి ప‌నిత‌నం అక్క‌ర‌కొస్తోంది.


Tags:    

Similar News