తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిల హవా అంతకంతకు పెరుగుతోంది. ప్రతిభతో పాటు ఇండస్ట్రీ ఆనుపానులు తెలుసుకుని ఈ రంగంలో రాణించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. విజయశాంతి.. జయసుధ లాంటి సీనియర్ నటీమణుల ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం లభిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల వెలుగులు పెరుగుతున్నాయని ప్రూవ్ అవుతోంది.
ఇషా రెబ్బా-చాందిని-అనసూయ- రేష్మి తరహాలోనే వచ్చిన అందగత్తె పూజిత పొన్నాడ టాలీవుడ్ లో వరుసగా పలు క్రేజీ అవకాశాల్ని అందుకుంటోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రలో నటించిన పూజిత ప్రస్తుతం వరుసగా అవకాశాల్ని అందుకుంది. పూజిత ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టే నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉన్నారు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పూజిత లేటెస్ట్ ఫోటోషూట్లు యువతరంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోషూట్లలో పూజిత అందాల ఎలివేషన్ హీట్ పెంచుతోంది. తాజాగా బీచ్ లో పూజిత వైట్ ఫ్రాకులో స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోల్లో తెలుగమ్మాయి అందచందాలకు యువతరం ఫిదా అవుతున్నారు.
లఘు చిత్రాలతో మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకున్న పూజిత.. హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `7`లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఓ లఘు చిత్రంలో చూసి సుకుమార్ `రంగస్థలం` చిత్రంలో అవకాశం ఇచ్చారు. అందులో ఆది భార్య పాత్రలో నటించింది.
2015లో ఉప్మా తినేసింది లఘుచిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించిన పూజిత 2016లో వచ్చిన `తుంటరి`తో పెద్ద తెర ప్రవేశం చేశారు. దర్శకుడు (2017)-రంగస్థలం-కల్కి (2019)-వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ (2019)-రన్ (2020) వంటి చిత్రాల్లో నటించారు. పూజిత స్వస్థలం విశాఖపట్నం. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై- ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది. ఇంజనీరింగ్ పూర్తచేసిన పూజిత టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేశారు. పూజిత నటించిన మిస్ ఇండియా (2020) (కీర్తి కథానాయిక) రిలీజ్ కావాల్సి ఉంది.