మామూలుగా యాక్షన్ సినిమాల్లో ఫైట్లు లేకపోతే బాగా బోర్ కొట్టేస్తుంది. అదే అతి పెద్ద వార్ సినిమాలో అయితే? ఖచ్చితంగా ఫైటింగులు ఉండాల్సిందే. అదీ ఆషామషీగా ఉంటే కాదు, ఏకంగా రక్తాలు ఏరులైపారాలి. ప్రతీ యాక్షన్ ఫ్రేమూ హీరో తాలూకు మాస్ ఇమేజ్ ను క్యారీ చేయాలంటే ఆ మాత్రం దెబ్బలు అదిరిపోవాలి మరి. ఇంతకీ ఈ టాప్ ఎందుకొచ్చింది అసలు?
ఏమీ లేదండీ.. తమిళంలో ''పులి'' అనే ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందేగా. విజయ్ హీరోగా చింబుదేవన్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమాను అక్కడి సాంబార్ బ్యాచ్ ఏకంగా బాహుబలికి పోటీగా మేము వదులుతున్న మిసైల్ అన్నట్లు చెబుతున్నారు. దానికితోడు యుట్యూబ్ హిట్లు చూపించి అప్పుడు జబ్బలు బాదుకుంటున్నారు కూడా. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు 'యు' సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. అంటే సినిమాలో అసలు ఏ మాత్రం రొమాన్స్, ఏ కోశాన కొన్న రక్తం చిందించే ఫైట్లు, అలాగే భారీ భారీ డైలాగులూ.. ఏదీ లేవనా దానర్ధం? లేకపోతే ఇంత పెద్ద భారీ కాన్వస్ బాహుబలి రేంజ్ మూవీకి 'యు' సర్టిఫికేట్ ఏంటండీ బాబూ.. మరీ కామెడీ కాకపోతే.
అయితే ట్రైలర్ లో విజయ్ చేసిన విన్యాశాలు, అలాగే పాటల్లో శృతి హాసన్ ఆరబోసిన అందాలు, సుదీప్ విలనీ, హన్సిక గ్లామర్, లేటు వయస్సులో శ్రీదేవి వయ్యారాలు చూస్తుంటే.. ఖచ్చితంగా యు/ఎ పడాల్సిన బొమ్మ ఏదో జిమ్మిక్ చేసి 'యు' తెచ్చారేమో అని డౌట్ వస్తోంది.