అల్లు హీరోయిన్‌.. కిస్సింగ్‌ పాలసీ

Update: 2016-01-17 11:30 GMT
అల్లు వారబ్బాయి.. అల్లు శిరీష్‌.. చాలా సింపుల్‌ గా గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటివరకు పెద్దగా క్రేజు లేని యామీ గౌతమ్‌ ను ఆ సినిమాతో అందరికీ తెలిసేట్టు చేశాడు కుర్రాడు. అప్పటికే రవిబాబు సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ఈ యామీ.. సరిగ్గా అదే సమయానికి హిందీలో విక్కీ డోనర్‌ అనే సినిమాలో హీరోయిన్‌ గా నటించడంతో సూపర్‌ పాపులర్‌ అయ్యింది.

ఇక మ్యాటర్‌ లోకి జంప్‌ అయితే.. అమ్మడు ఇప్పుడు హిందీలో పులకిత్‌ సామ్రాట్‌ అనే హీరోతో నడిపిస్తున్న ప్రేమాయణం హాట్‌ టాపిక్‌ అయిపోయింది. ఇతగాడు తన వైఫ్‌ కు డివోర్స్‌ ఇస్తానంటూ ప్రకటించి మరీ యామీతో ఎఫైర్‌ కొనసాగిస్తున్నాడు. అంతే కాదు.. ఈ జంట ప్రస్తుతం నటిస్తున్న ''సనం రే'' అనే సినిమా కోసం వెండితెరపై ఒక ఘాటు ముద్దు కూడా పెట్టేసుకున్నారు. సర్లే.. ఇక్కడే ఉంది మ్యాటరు. హీరో పులకిత్‌ ను మరో హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా తో ముద్దు సీన్‌ చేయమంటే నో అనేశాడట. అదే విధంగా యామీ కూడా యహీ హూ మై అనే మ్యూజిక్‌ వీడియోలో హీరో అయుష్మాన్‌ తో కిస్సింగ్‌ సీన్‌ చేయమంటే నో అనేసింది.

సో.. పులకిత్‌ అండ్‌ యామీ.. ఒకరితో ఒకరు ముద్దులకు రెడీ. వేరే వారితో అయితే నో. వాటే కిస్సింగ్‌ పాలసీ. ఇంత జరుగుతున్నా కూడా వారు తమ ఎఫైర్‌ గురించి పెదవి విప్పడంలేదు.

Tags:    

Similar News