ప్రముఖ గాయకుడు అరెస్ట్.. రెండేళ్ల జైలు శిక్ష

Update: 2022-07-14 16:35 GMT
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దలేర్ పై మానవ అక్రమ రవాణా  ఆరోపణలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పాటియాలా కోర్టు 2 సంవత్సరాల శిక్షను సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. 2003 నాటి కేసులో ఎట్టకేలకు 19 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. దలేర్ తో పాటు అతడి సోదరుడు షంషేర్ కూడా ఈ కేసులో శిక్ష అనుభవించాల్సి ఉంది కానీ.. ఆయన గతంలోనే అనారోగ్య కారణాలతో మరణించారు.

2003లో దలేర్ మెహందీ, అతడి సోదరుడు షంషేర్ సింగ్ పై మానవ అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఈ ఇద్దరిపై 31 కేసులు నమోదయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. మనుషులను అక్రమంగా విదేశాలకు పంపడం ద్వారా వారు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దలేర్ మెహందీకి 15 ఏళ్ల తర్వాత అంటే 2018లో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే దలేర్ మెహందీ తరుఫు న్యాయవాది పాటియాలా కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు.

ఆ తర్వాత కోర్టు గురువారం 2018 నాటి నిర్ణయాన్ని సమర్థిస్తూ దలేర్ మెహందీని జైలుకు పంపింది. తీర్పు అనంతరం దలేర్ మెహందీని కోర్టులో అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి జైలుకు పంపనున్నారు.

1998-99 మధ్య దలేర్ మెహందీ శాన్ ఫ్రాన్సిస్ కో సహా న్యూజెర్సీలలో 10 మందిని అక్రమంగా వదిలి వచ్చాడని ఆరోపణలున్నాయి. సోదరులిద్దరూ విదేశాలకు తీసుకెళ్లేందుకు పాసేజ్ మనీగా కోటి రూపాయలు వసూలు చేసేవారట.. 2006లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేసులో ఆయన కార్యాలయంపై దాడి జరిగింది.

కేసు ఫైల్ కు సంబంధించిన పత్రాలు అలాగే పాసేజ్ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 2018లో పంజాబ్ లోని పాటియాలా కోర్టు 2003 మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించినా శిక్ష ఖరారు చేసిన 30 నిమిషాలకే దలేర్ మెహందీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 ఆయన కేవలం పంజాబీలోనే కాక తెలుగు సహా పలు ఇతర భాషల్లో సూపర్ హిట్ పాటలు పాడారు. బాహుబలి, యమదొంగ, బాద్షా, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలకు పాటలు పాడారు.
Tags:    

Similar News