డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పై కూడా కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడినది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు ఆయన నిర్మాణంలో రూపొందుతున్న రొమాంటిక్ సినిమాలు రెండు కూడా ఆగిపోయాయి. ఒకటి విజయ్ దేవరకొండతో తాను తీస్తున్న సినిమా కాగా రెండవది తన కొడుకు ఆకాష్ పూరితో పూరి నిర్మిస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలు సమ్మర్ లో విడుదల చేయాలనుకున్న పూరికి నిరాశ తప్పేలా లేదు. లాక్ డౌన్ సమయంను తాను కథలు రాసుకునేందుకు వినియోగిస్తున్నట్లుగా పూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఈ సమయంను తాను వినియోగించుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. భిన్నమైన కథలు ఆలోచించేందుకు ఈ సమయం నాకు ఉపయోగపడుతుందని అన్నాడు. ప్రస్తుతం ఒక స్టార్ హీరో కోసం కథను రాస్తున్నట్లుగా పూరి చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండతో సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తాను అన్నట్లుగా పూరి చెప్పుకొచ్చాడు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయంలో మాత్రం పూరి క్లారిటీ ఇవ్వక పోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.
అయితే ఎక్కువ శాతం మంది మాత్రం పూరి ప్రస్తుతం రాస్తున్న కథ బాలకృష్ణ కోసం అంటున్నారు. వీరిద్దరి కాంబోలో పైసా వసూల్ చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా నిరాశ పర్చడంతో బాలయ్యకు సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో పూరి ఉన్నాడు. బాలయ్యకు కూడా పూరి వర్కింగ్ స్టైల్ నచ్చడంతో తప్పకుండా మరో సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట. అందుకే బాలయ్య కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.