తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి... భాగ్య నగరి హైదరాబాదును కుదపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ను పెద్ద ప్రమాదంలోకే నెట్టేసేలా ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ వాడకంతో పాటు డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలున్నయన్న ఆరోపణలతో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అనున్ సబర్వాల్ నేతృత్వంలో ఆ శాఖ ఉన్నతాధికారులు డ్రగ్స్ వ్యాపారంపై కీలక దృష్టి సారించారు. ఈ దెబ్బతో హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్న సంకల్పంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు సాగుతున్న విషయం తెలిసిందే.
డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ అరెస్ట్ - అతడి సెల్ ఫోన్ - అందులోని కాల్ డేటా తదితరాలను పరిశీలించిన అధికారులు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారిని విచారించే పని నేటి ఉదయం హైదరాబాదులోని నాంపల్లి పరిసరాల్లో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రారంభమైంది. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు తొలి వ్యక్తిగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరయ్యారు. సోదరుడు సాయిరాం శంకర్ - కుమారుడు ఆకాశ్ తో కలిసి విచారణకు వచ్చిన పూరీ... పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగానే సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. కాసేపటి క్రితం తొలి సెషన్ విచారణ పూర్తి కాగా... మధ్యాహ్న భోజన విరామం ఇచ్చిన పోలీసులు... మరో దఫా పూరీని విచారించే అవకాశాలున్నాయి.
విచారణలో ఏఏ ప్రశ్నలు పూరీకి ఎదురయ్యాయన్న విషయాలను పరిశీలిస్తే... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పూరీని పోలీసులు ఏకంగా 22కు పైగా ప్రశ్నలు సంధించారట. అసలు కెల్విన్ ఫోన్ లో తనకు సంబంధించిన నెంబర్ల నుంచి ఫోన్లు వెళ్లిన విషయాలతో పాటు మెసేజ్ లు వెళ్లిన విషయంపై పూరీ కాస్తంత స్పష్టంగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు కెల్విన్ తనకు తెలియదని పూరీ చెప్పలేదని కూడా తెలుస్తోంది. మరి కెల్విన్ తనకు తెలుసని పూరీ జగన్నాథ్ ఒప్పేసుంటే... డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధాలు ఉన్నట్లుగా ఒప్పుకున్నట్టేగా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే... నేటి సాయంత్రం పూరీ జగన్నాథ్ అరెస్టయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. విచారణ సందర్భంగా పూరీ జగన్నాథ్ అసలు విషయాలను ఏమాత్రం దాచలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే నేటి సాయంత్రానికి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.