ఎన్నో హిట్ చిత్రాలకు తమ ఆలోచనల్ని - సహాయ సహకారాల్నిఅందించిన దర్శకులు - కో డైరెక్టర్ లు ప్రస్తుతం పని లేక.. అవకాశాలు రాక.. వయసు సహకరించక ఆర్థిక ఇబ్బందులతో కాలం వెల్లదీస్తున్నారు. వారిని ఆదుకోవడానికి.. ఓ దర్శకుడిగా తన వంతు చిరు సాయం అందించడానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లీడ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించి 20 మంది దర్శకులు.. కో డైరెక్టర్లకు తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ మీడియా ప్రకటనను తాజాగా విడుదల చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది.
`సినిమాతో మమేకమైన ప్రతి ఒక్కరిపై మాకు అపారమైన గౌరవం వుంది. సినిమా అన్నది వ్యాపారమే అయినా డబ్బులు పెట్టే నిర్మాత కూడా దర్శకుడి ప్రతిభనే నమ్ముతాడు. దర్శకుడు మేధస్సు.. సృజనాత్మకత.. అవిశ్రాంతమైన శ్రమకు ప్రతి రూపం సినిమా. ఒక దర్శకుడికి సినిమా అవకాశం వస్తే ఎంతో మందికి పని దొరుకుతుంది. అందుకే దర్శకులు.. దర్శకత్వ శాఖ బాగుండాలని కోరుకుంటున్నాము. విజయాలు.. అపజయాలు సహజం. అయినా సినిమానే నమ్ముకుని మనదైన రోజు కోసం ఎదురుచూస్తూ వుంటాం. దర్శకత్వ శాఖలోని మన వాళ్లు కొందరు పనిలేకనో.. సినిమాలు చేసే అవకాశం రాకనో ఖాళీగా వుండి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లని చూసి మనసుకి కష్టంగా వుంది...
`ఇస్మార్ట్ శంకర్` అద్భుత విజయాన్ని పురస్కరించుకుని ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఇదేమి పెద్ద సాయం కాదు చిరునవ్వులాంటి పలకరింపు` అని పూరి పేరుతో రాసిన లేఖ పలువురిని ఆలోచింపజేస్తోంది.
మరి పూరీని ఆయన ఆదర్శాన్ని ఫాలో అయ్యే దర్శకులు ఎంత మంది?. ఫామ్ లో వున్నవాళ్లంతా పూరీని ఫాలో అవుతారా? అన్నది చూడాలి. అయితే ఇలాంటి సహాయనిధి కోసమే ఆ మధ్య జరిగిన డైరెక్టర్స్ డే రోజున దర్శకుడు రాజమౌళి- రాఘవేంద్రరావు- చిరంజీవి- బాహుబలి నిర్మాతలు- త్రివిక్రమ్ శ్రీనివాస్ విరాళాలు ప్రకటించారు. దాదాపు అదే కోటి దాటింది. ఆ నిధిని పనిలేక.. వయసు మీదపడి పనిచేయలేని వారికి పెన్షన్ గా అందించాలని ప్లాన్ చేశారు. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అలాగే దర్శకసంఘం సొంత భవంతి నిర్మాణం పైనా టాప్ డైరెక్టర్స్ అంతా దృష్టి సారిస్తారేమో చూడాలి.