8 కోట్లెక్కడ... 30 కోట్లెక్కడ..

Update: 2015-11-22 06:18 GMT
నవతరం హీరోల్ని వెండితెరకి పరిచయం చేయాలంటే టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తర్వాతే ఎవరైనా. హీరోయిజాన్ని పక్కాగా ఆవిష్కరించే దర్శకుడిగా అతడికి పేరుంది. మాస్‌, యాక్షన్‌ హీరో ఇమేజ్‌ ని పక్కాగా ఇన్‌ సర్ట్‌ చేయడంలో తనకంటూ ఓ స్టయిల్‌ ఉంది. స్పీడ్‌ స్క్రీన్‌ ప్లే తో మ్యాజిక్‌ చేస్తూనే హీరోలో పెర్ఫామెన్స్‌ చూపించే కోణాన్ని పూర్తిగా ఎలివేట్‌ చేస్తాడన్న పేరుంది. రామ్‌ చరణ్‌ ని చిరుతగా అతడు చూపించిన తీరు అద్భుతం. ఆ తర్వాత బన్నిని దేశముదురుగా చూపించిన తీరు, మహేష్‌ ని పోకిరిగా చూపించిన తీరు సౌత్‌ లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

అందుకే ఎవరైనా కొత్త హీరో పరిశ్రమకి పరిచయం అవుతున్నాడంటే ముందుగా చూసేది పూరీ వైపే. అతడి దర్శకత్వంలో అయితేనే స్టార్‌ డమ్‌ వచ్చేస్తుందన్న నమ్మకం. ఎవరైనా నిర్మాత తనయుడిని వెండితెరకి పరిచయం చేయాలన్నా, లేదా ఏకంగా ప్రధానమంత్రి మనవడినే తెరకి పరిచయం చేయాలన్నా ఉన్న ఏకైక ఆప్షన్‌ పూరి మాత్రమే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఓ ఇద్దరు హీరోల్ని బడాబాబులు పూరీకి అప్పగించారు. అంతేకాదు ఈ ఇద్దరినీ హీరోలుగా ఆవిష్కరిస్తున్నందుకు పూరీకి ఏకంగా భారీ పారితోషికాన్ని ఎర వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి పారితోషికం 8కోట్లు. దాన్ని రెట్టింపు చేసి 15 కోట్లు చెల్లించుకుంటున్నారని టాక్‌.

మహాత్మ నిర్మాత సి.ఆర్‌.మనోహర్‌ అన్న కొడుకు ఇషాన్‌ ని రోగ్‌ ద్వారా పరిచయం చేస్తున్నందుకు 15 కోట్లు ఇస్తున్నారట. ఇకపోతే ఇప్పటికే మహాదేవ్‌ అనే డైరక్టర్‌ చేతులమీదుగా మాజీ ప్రధాని దేవ గౌడ మనువడు నిఖిల్‌ గౌడ తెరంగేట్రం చేయాల్సి ఉన్నా.. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. విజయేంద్రప్రసాద్‌ రాసిన ఆ కథకు.. ఇప్పుడు పూరి జగన్‌ తో డైరక్షన్‌ చేయిస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కన్నడలో పునీత్‌ రాజ్‌ కుమార్‌ ను పూరి ఇంట్రొడ్యూస్‌ చేయగా.. అతగాడు అక్కడ పవర్‌ స్టార్‌ అయిపోయాడు. అందుకే నిఖిల్‌ గౌడ్‌ కూడా పూరి వెనుక పడుతున్నాడని టాక్‌. అదే జరిగితే.. అప్పుడు కూడా ఒక 15 సమర్పించుకోవాల్సిందే మరి. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News